For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహీంద్రా బొలెరో మేడిన్ తెలంగాణ

By Chanakya
|

మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఫాస్ట్ మూవింగ్ పికప్ వెహికల్ బొలెరో ప్రీమియం వర్షన్‌ను హైదరాబాద్‌లో లాంఛ్ చేశారు. తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజీతో పాటు రఫ్ అండ్ టఫ్‌ వాహనంగా ప్రధానంగా చిన్న వ్యాపారస్తులకు, రైతులకు ఉపయోగపడే ఈ వాహనానికి కొత్త సొబగులు అద్దింది మహీంద్రా. దీనికి మహీంద్రా క్యాంపర్ జెడ్ ఎక్స్ గోల్డ్‌గా నామకరణం చేశారు. మూడు వేరియంట్స్‌లో ఇది లభించబోతోందని మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) విక్రం గార్గా వెల్లడించారు. వీటిల్లో బొలెరో నాన్ ఏసీ, బొలెరో క్యాంపర్ ఫోర్ వీల్ డ్రైవ్ (4WD), గోల్డ్ విఎక్స్ ఉండబోతున్నాయి.

ట్రేడ్ వార్... మేడిన్ చైనా యుగం ముగిసిపోయింది: వరల్డ్ టాప్ బైస్కిల్ మేకర్ట్రేడ్ వార్... మేడిన్ చైనా యుగం ముగిసిపోయింది: వరల్డ్ టాప్ బైస్కిల్ మేకర్

మేడిన్ తెలంగాణ

మేడిన్ తెలంగాణ

తెలంగాణలోని జహీరాబాద్‌లో ఉన్న మహీంద్రా ప్లాంట్‌లో ఈ బొలెరో వాహన శ్రేణని కంపెనీ తయారు చేసింది. ఇదే ప్లాంటులో ట్రాక్టర్లను కూడా తయారు చేస్తోంది ఈ సంస్థ. దేశవ్యాప్తంగా నెలకు సుమారు 14 వేల నుంచి 15 వేల వరకూ బొలెరో వాహనాలకు డిమాండ్ ఉంటుందని, వీటిల్లో కొంత వాటా తెలంగాణ ప్లాంట్ తీరుస్తుందని యాజమాన్యం చెబ్తోంది.

కొత్త ఫీచర్స్

కొత్త ఫీచర్స్

మంచి పికప్, టఫ్ డిజైన్, తక్కువ మెయింటెనెన్స్ ఉండే ఈ వెహికల్‌లో ఇప్పుడు ఇంటీరియర్స్‌ను పూర్తిగా మార్చారు. ఐదు సీట్ల డబుల్ క్యాబిన్‌లో ఫాక్స్ లెదర్ సీట్స్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ వంటి కొత్త ఫీచర్స్‌ను తీసుకువచ్చారు. సుమారు 1000 కలోల పే లోడ్ కలిగిన ఈ పికప్ వాహనాలు ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అధికంగా ఉపయోగపడ్తాయి. వీటి రగ్డ్ ఫీచర్స్ వల్ల కొండలు, గుట్టలు, మైనింగ్ సహా రఫ్ రోడ్లపై వ్యాపార సేవలు నిర్వహించే వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అలాంటివారికి కూడా ప్రీమియం సేవలు అందించేందుకు ఇంటీరియర్స్ మార్పు చేసినట్టు సంస్థ వెల్లడించింది. రెండు సంవత్సరాలు ఉన్న వారెంటీని మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్లకు పెంచడంతో పాటు మైలేజ్ కూడా 15.1 కిమీ వస్తోందని తెలిపారు.

ధర ఎంత

ధర ఎంత

హైదరాబాద్ ఎక్స్ షోరూం ధర రూ.7.26 నుంచి 7.82 లక్షల మధ్య నిర్ణయించారు. నాలుగు వేరియంట్స్ ఉన్న నేపధ్యంలో ఈ ధరల్లో తేడాలు ఉన్నాయి.

మార్కెట్ ఎలా ఉందంటే..

మార్కెట్ ఎలా ఉందంటే..

ప్రస్తుతం పికప్ సెగ్మెంట్లో మహీంద్రాది 65 శాతానికి పైగా మార్కెట్ వాటా ఉంది. అయితే దీన్ని మరింతగా పెంచుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు కొద్దిగా వెనక్కి లాగుతున్నట్టు విక్రం గుర్గా చెప్పారు. గత కొద్దికాలం నుంచి ఆటోమొబైల్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఈ సారి వర్షాభావ పరిస్థితులు నెలకొంటే కొద్దిగా ఇబ్బందులు తలెత్తకతప్పదని ఆయన అంచనా వేస్తున్నారు.

Read more about: mahindra hyderabad
English summary

మహీంద్రా బొలెరో మేడిన్ తెలంగాణ | Mahindra and Mahindra expects up to 12% growth in Bolero pickups in FY20

Mahindra and Mahindra expects 10 to 12 percent growth in its Bolero range pickups this fiscal, a senior executive of the $20 billion-group said on June 18.
Story first published: Wednesday, June 19, 2019, 7:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X