బీజింగ్: 'Era of Made in China Is Over' మేడిన్ చైనా యుగం ముగిసింది... ఈ మాటలు అన్నది ఎవరో కాదు... ప్రపంచంలోనే అత్యధికంగా సైకిళ్లను తయారు చేసే జెయింట్ మ్యానిఫ్యాక్చరింగ్ కో చైర్మన్ బోన్నీటు అన్నారు. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం టారిఫ్ అన్నారో.. అప్పటి నుంచే తాము సీరియస్‌గా దృష్టి సారించామని చెప్పారు. ప్రస్తుతం ఈ కంపెనీ అమెరికాకు చెందిన తమ ఆర్డర్ల కోసం తమ ప్రొడక్షన్‌ను తైవాన్‌కు మార్చాలని నిర్ణయించింది.

అమెరికా దెబ్బకు చైనాను వదులుతున్న కంపెనీలు
తాము అధిక టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ గత సెప్టెంబర్‌లో చెప్పినప్పటి నుంచే ఈ సైకిళ్ల తయారీ కంపెనీ ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ట్రంప్ నోరు మూయకముందే తాము వెళ్లేందుకు సిద్ధమయ్యామన్నారు. తద్వారా ట్రంప్ తమపై టారిఫ్ విధించకముందే వెళ్తున్నట్లుగా చెప్పారు. ట్రంప్ టారిఫ్ దెబ్బకు చైనా నుంచి పలు కంపెనీలు వలస పోతున్నాయి. కొన్ని కంపెనీలు అమెరికాకు, మరికొన్ని ఇతర దేశాలకు వెళ్తున్నాయి.

జెయింట్ దారిలోనే మరిన్ని కంపెనీలు
అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో పలు కంపెనీలు చైనా నుంచి తరలి వెళ్తున్నాయి. తమ సరఫరాదారుల విషయంలో మరోసారి సమీక్షిస్తామని ఇంటెల్ కార్ప్ పేర్కొంది. కన్స్యూమర్ గూడ్స్ సప్లయర్ Li & Fung Ltd స్పందిస్తూ... ఈ వాణిజ్య యుద్ధం తమను మరోవైపు వెళ్లేలా చేస్తోందని వ్యాఖ్యానించింది. చైనాకు చెందిన దాదాపు రెండు వందల సంస్థలు భారత్ వైపు కూడా చూస్తున్నాయట. రాబోయే ఏడాదిన్నరలో ప్రభుత్వం కొన్ని విధానపరమైన మార్పులు చేస్తే కంపెనీల వస్తాయని అంటున్నారు.

గత ఏడాదే గుర్తించా...
తాజాగా, జెయింట్‌కు చెందిన బోన్నిటు మాట్లాడుతూ... మేడిన్ చైనా మరియు ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా సరఫరా అంశం ముగిసిన యుగం అని, దీనిని తాను గత ఏడాది గుర్తించానని చెప్పారు. ఇప్పటికే ఈ మౌంటేన్ అండ్ రేసింగ్ సైకిల్స్ తయారీ సంస్థ.. జెయింట్ 2018 చివరి దశలోనే చైనాలోని తమ ప్లాంట్ ఒకదానిని క్లోజ్ చేసింది. జెయింట్ గత ఏడాది జూలై నెలలో హంగేరీలో ఓ ఫ్యాక్టరీని తెరిచింది. జెయింట్‌కు తైవాన్, నెదర్లాండ్స్‌లో ప్లాంట్స్ ఉన్నాయి. చైనాలో మరో ఐదు ప్లాంట్లు ఉన్నాయి. దక్షిణాసియాలో ఓ భాగస్వామి కోసం చూస్తోంది.

ట్రేడ్ వార్ కంటే బెట్టర్
చైనాలో ఒక సైకిల్ తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేయాలంటే 100 డాలర్ల వరకు టారిఫ్ చెల్లించాల్సిన పరిస్థితి. అదే జీరో టారిఫ్ దేశాల నుంచి ఎగుమతి చేస్తే మిగులు అవుతుంది దీంతో ఆ సంస్థ తైవాన్‌కు వెళ్తోంది. అయితే తైవాన్‌లో ఉద్యోగుల వేతనాలు ఎక్కువ. విడి విభాగల సరఫరా వేగంగా ఉండదు. కానీ ట్రేడ్ వార్ కంటే ఇది బెట్టర్ అని జెయింట్ ఆలోచిస్తోంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాకు భారీ షాకిచ్చిన ఇరాన్.. 4 వేల మైళ్ల దూరం నుంచి డియాగో గార్సియా సైనిక స్థావరంపై దాడి..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

ఇరాన్‌ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications