For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిజిటల్ చెల్లింపుల్లో సమస్యలున్నాయా? అంబుడ్స్‌మెన్ ఉందిగా...

By Jai
|

పెద్ద నోట్ల రద్దు తర్వాతి నుంచి అంటే 2017 నవంబరు నుంచి మన దేశం డిజిటల్ చెల్లింపులు ఊపందుకున్నాయి. కార్డుల ద్వారా చెల్లింపులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు, ఈ-వ్యాలెట్ల వినియోగం ఊహించని స్థాయిలో పెరిగింది. ఇదే సమయంలో డిజిటల్ రూపంలో ఆర్థిక లావాదేవీలు జరిపినప్పుడు సమస్యలు ఎదురు కావడం కూడా ఎక్కువయింది. వీటికి పరిష్కారం దొరకడం కష్టంగా మారడంతో కస్టమర్లు డబ్బులు కోల్పోయారు. సైబర్ మోసాల ద్వారా కూడా వినియోగదారులకు నష్టాలు వచ్చాయి. బ్యాంకు ఖాతాదారులకు ఇబ్బందులు కలిగితే బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ కు ఫిర్యాదు చేయవచ్చు.

ఏపీలో స్కూల్‌కు పంపిస్తే రూ.15,000! ఏ పథకం.. ఎంత లబ్ధి!!ఏపీలో స్కూల్‌కు పంపిస్తే రూ.15,000! ఏ పథకం.. ఎంత లబ్ధి!!

మరి ప్రీపెయిడ్ ఇన్ స్ట్రుమెంట్స్ (పీపీఐ), ఈ-వ్యాలెట్, ఇతర పేమెంట్ సర్వీసు ప్రొవైడర్ల సర్వీసుల్లో సమస్యలు వస్తే ఆయా సంస్థలపై ఎవరికి ఫిర్యాదు చేయాలి. ఇందుకు ఒక వ్యవస్థ లేకపోవడంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న భారత రిజర్వు బ్యాంకు డిజిటల్ పెమెంట్స్ అంబుడ్స్ మన్ ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కస్టమర్లు తమకు ఏమైనా సమస్యలు ఉంటే దేశంలోని 19 నగరాల్లోని 21 ప్రాంతాల్లో ఉన్న అంబుడ్స్ మన్ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేయవచ్చు. ప్రత్యేకముగా ఓకే అటారిటీ ఉన్న కారణంగా ఫిర్యాదుల పరిష్కారం వేగవంతంగా జరిగే అవకాశం ఏర్పడుతోంది.

ఫిర్యాదులు ఎప్పుడు చేయవచ్చంటే?

ఫిర్యాదులు ఎప్పుడు చేయవచ్చంటే?

డిజిటల్ పెమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్లకు వ్యతిరేకంగా ఎప్పుడు ఫిర్యాదు చేయవచ్చంటే.. అనధికారికంగా ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ జరిగినప్పుడు, బ్యాంకు ఖాతాకు నిధులను బదిలీ చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, వాలెట్ లో డబ్బులు లోడ్ కానప్పుడు, ఆన్ లైన్ పేమెంట్ చేసినప్పుడు అది విఫలమై డబ్బులు ఖాతాలోంచి తగ్గినప్పుడు, లావాదేవీ విఫలమైనప్పుడు మీ సొమ్మును రిఫండ్ చేయలేనప్పుడు మీరు డిజిటల్ అంబుడ్స్ మన్ కు ఫిర్యాదు చేయవచ్చు. యూనిఫైడ్ పెమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపీఐ), భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్, భారత్ క్యూ ఆర్ కోడ్, యూపీఐ క్యూ ఆర్ కోడ్ వంటివి కూడా ఈ అంబుడ్స్ మన్ పరిధిలోకి వస్తాయి. కస్టమర్ల సమస్యలను పరిష్కరించడం పెమెంట్స్ సర్వీస్ సంస్థల విధి, బాధ్యత. అయితే కొన్ని సందర్భాల్లో ఈ కంపెనీలు నిర్లక్ష్యం వహిస్తుంటాయి. కాబట్టి అంబుడ్స్ మన్ అవసరం ఏర్పడుతోంది.

ఫిర్యాదు చేయడం ఎలాగంటే?

ఫిర్యాదు చేయడం ఎలాగంటే?

డిజిటల్ పేమెంట్ వాలెట్లు లేదా ఇతర పీపీఐల ద్వారా లావాదేవీ నిర్వహించినప్పుడు ఏదైనా సమస్యవస్తే ముందుగా ఆ సర్వీస్ ప్రొవైడర్ కు ఫిర్యాదు చేయాలి. మీ సమస్యను పరిష్కరించనట్టయితే మీకు సర్వీసు అందించి సర్వీసు ప్రొవైడర్ కార్యాలయం ఉందొ దాని పరిధిలోని అంబుడ్స్ మన్ కు ఫిర్యాదు చేయవచ్చు. మీరు నేరుగా ఆఫీస్ కు వెళ్లనవసరం లేకుండా అంబుడ్స్ మన్ కార్యాలయ ఈ-మెయిల్ ఐడీ కి ఫిర్యాదు పంపవచ్చు. ఆర్బీఐ వెబ్ సైట్ లో అంబుడ్స్ మన్ కార్యాలయాల ఈ-మెయిల్ ఐడీ లు ఉంటాయి. మీ వ్యక్తిగత వివరాలతో పాటు మీ ఫిర్యాదుకు సంభందించిన సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అన్ని రకాల ప్రూఫ్ లు ఉంటే మీరు తగిన పరిహారాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది.

మరిన్ని అంశాలు..

మరిన్ని అంశాలు..

- మీ ఫిర్యాదును ఒక ఫోరమ్ లో మాత్రమే చేయాలి. ఇదివరకే ఫిర్యాదు చేసి ఉంటే మీ ఫిర్యాదును అంబుడ్స్ మన్ స్వీకరించదు.

- మీ ఫిర్యాదు అర్హత ఆధారంగా స్వీకరణ ఉంటుంది.

- మీరు ఫిర్యాదు చేయడంలో జాప్యం జరిగితే మీకు ప్రయోజనం లభించక పోవచ్చు.

- మీరు ఏడాది లోపు ఫిర్యాదు చేయడం మంచిది.

- ఇక అంబుడ్స్‌మెన్ వెలువరించిన నిర్ణయం సంతృప్తి కరంగా లేకపోతే కస్టమరుకాని, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ కానీ ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్ ను ఆశ్రయించవచ్చు.

- ఇందుకు 30 రోజుల గడువు ఉంటుంది.

- కస్టమర్ల సమయం వృధా అయినందుకే కాకుండా ఖర్చులు అయినందుకు, మానసికంగా ఇబ్బంది కలిగినందుకు రూ. లక్ష పరిహారాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.

- గరిష్టంగా రూ. 20 లక్షల పరిహారాన్ని ఇవ్వమని అంబుడ్స్ మన్ ఆదేశాలు ఇవ్వవచ్చు.

Read more about: digital
English summary

డిజిటల్ చెల్లింపుల్లో సమస్యలున్నాయా? అంబుడ్స్‌మెన్ ఉందిగా... | There's an ombudsman for digital transactions now

If your complaint regarding failure of a digital transaction to an e wallet or any other service provider is pending without resolution, you can now take up the matter with the ombudsman for digital transactions.
Story first published: Monday, June 17, 2019, 14:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X