హర్మూజ్ జలసంధిలో రెండు చమురు నౌకలపై దాడి నేపథ్యంలో ఆసియాలోని చమురు దిగుమతి దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు దాడి నేపథ్యంలో ఆసియా దేశాలకు మరింత చమురు భయం పట్టుకుంది. నార్వేకు చెందిన ఫ్రంట్ ఆల్‌టైర్, జపాన్‌కు చెందిన కొకుకా కరేజస్ ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరిగాయి. ఫ్రంట్ ఆల్‌టైర్ నౌక ఇథెనాల్‌తో ఖతార్ నుంచి తైవాన్‌కు, కొకుకా కరేజస్ నౌక మిథెనాల్‌తో సౌదీ అరేబియా నుంచి సింగపూర్‌కు వెళ్తున్నాయి. ఈ సమయంలో దాడులు జరిగాయి.

జపాన్ 80 శాతం ఆయిల్ దిగుమతులు ఇక్కడి నుంచే
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆయిల్ రవాణా.. దాదాపు అయిదో వంతు హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ఆసియా దేశాలకు ఇది ఎంతో కీలకం. మిడిల్ ఈస్ట్ నుంచి జపాన్ దాదాపు 80 శాతం ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. అమెరికా, చైనా, భారత్ తర్వాత ఎక్కువ ఆయిల్ ఉపయోగించే దేశం జపాన్. అలాగే ఇండోనేషియాది అదే పరిస్థితి. అలాంటి జలసంధిపై దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా వంటి చమురు ఉత్పత్తి దేశాల నుంచి చైనా, జపాన్, భారత్ వంటి ఆసియా దేశాలకు హర్మూజ్ సంధి కీలకం. మరోవైపు దాడులు జరిగిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ 3.65 శాతం పెరిగింది.

ఇరాన్‌వైపు అమెరికా వేళ్లు
ఈ దాడులపై జపాన్‌కు చెందిన ఎకానమి, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ హిరోషిగె సేకో మాట్లాడుతూ... తాము ఈ అంశంపై దృష్టి సారించామన్నారు. గ్రూప్ 20 సమావేశంలో దీనిని ప్రస్తావిస్తామని శుక్రవారమే చెప్పారు. మరోవైపు, ఈ దాడుల పని ఇరాన్ సైన్యానిదేనని అమెరికా ఆరోపిస్తోంది. తమపై ఆంక్షల నేపథ్యంలో ఈ జలసంధిని క్లోజ్ చేస్తామని గతంలో ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. ఇరాన్-అమెరికా మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్న విషయం తెలిసిందే.

భారత్‌కు ఇబ్బందే
హర్మూజ్ జలసంధి వద్ద దాడి భారత్‌కు కూడా చమురుపరంగా ఇబ్బందికరమే. మరో దారిలో చమురు దిగుమతులు చేసుకుంటే ఖర్చులు పెరుగుతాయి. ఈ ప్రభావం వినియోగదారులపై పడుతుంది. ఈ దాడులపై అన్ని దేశాలు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications