TCS భారీగా జీతాలు ఇస్తోందా?: చైర్మన్ ఏమన్నారంటే?

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు భారీ వేతనాలు చెల్లిస్తోందన్న ఆరోపణలు, షేర్ హోల్డర్స్ ఆందోళనలపై ఆ కంపెనీ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పందించారు. టీసీఎస్ వృద్ధికి, అద్భుత ఫలితాలను సాధించిన ఘనత టీసీఎస్ మేనేజ్‌మెంట్‌కు దక్కుతుందని చెప్పారు. ఇందుకు వారికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని సంస్థ భావించిందని చెప్పారు. గురువారం నాడు జరిగిన యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో సీనియర్ ఉద్యోగులకు ఇచ్చే హైశాలరీస్‌ను లేవనెత్తారు. దీందో టాప్ మేనేజర్లకు, ఇతరులకు ఇచ్చే కంపన్షేషన్ స్ట్రక్చర్‌ను చంద్రశేఖరన్ సమర్థించారు.

ఎక్కువ వేతనాలు సరికాదు

ఎక్కువ వేతనాలు సరికాదు

కొందరికి ఎక్కువ వేతనాలు చెల్లిస్తుందనే వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. వారికి ఎక్కువగా ఏమీ ఇవ్వడం లేదని చెప్పారు. అలా అయితే వారికి మరింత చెల్లించాలని, కానీ కంపెనీ సంస్థ సంప్రదాయంగానే ముందుకు సాగుతోందన్నారు. కొంతమందికి రిటైర్మెంట్ ఏజ్ దాటినా విధులు నిర్వర్తిస్తున్నారనే అంశంపై చంద్రశేఖరన్ మాట్లాడుతూ... వారికి సముచిత నైపుణ్యం ఉందని, వారి అనుభవానికి గౌరవం ఇవ్వాలన్నారు. ఉద్యోగులను నిలుపుకోవడం ప్రధానంగా తాము ఎక్కువగా దృష్టి పెట్టామని టీసీఎస్ సీఎండీ రాజేష్ గోపినాథన్ చెప్పారు.

రూ.1కోటికి పైగా వేతనం

రూ.1కోటికి పైగా వేతనం

టీసీఎస్‌లో దాదాపు 100 మంది కంటే ఎక్కువ ఉద్యోగులకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటి కంటే ఎక్కువ వేతనం అందుకున్నట్లు నివేదికలు వచ్చాయి. కంపెనీలోనే ఉంటూ, మంచి ప్రతిభ కనబరుస్తున్న వారికి ఎలాంటి రివార్డ్స్ ఇవ్వాలనే అంశంపై బోర్డ్, నామినేషన్ కమిటీలు ఎప్పటికప్పుడు చర్చిస్తాయని చంద్రశేఖరన్ చెప్పారు. కాగా, అలాంటి రివార్డ్స్ అందుకున్న ఉద్యోగుల్లో 25 శాతం మంది ఉద్యోగులు టీసీఎస్‌లోనే కెరీర్ ప్రారంభించినవారు. టీసీఎస్ ఉద్యోగులకే 52 శాతం రెవెన్యూ వెళ్తోందని, ఇది ఎక్కువ అని షేర్ హోల్డర్స్ అభిప్రాయపడుతున్నారు.

టీసీఎస్‌లో వందకు పైగా, ఇన్ఫోసిస్‌లో 60

టీసీఎస్‌లో వందకు పైగా, ఇన్ఫోసిస్‌లో 60

2017-18 ఆర్థిక సంవత్సరంలో TCSలో రూ.కోటిపైగా వేతనం అందుకున్న వారు 91 మంది. 2018-19 సంవత్సరానికి ఈ సంఖ్య 103కి చేరుకుంది. సీఈవీ రాజేశ్ గోపినాథన్, సీఓఓ ఎన్‌జీ సుబ్రహ్మణ్యం, విదేశాల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌ల్ని కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. TCS లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, పబ్లిక్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ డెబాషిస్ ఘోష్ రూ .4.7 కోట్లు సంపాదించారు. బిజినెస్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ హెడ్ కృష్ణన్ రామానుజం రూ.14.1 కోట్లు. బ్యాంకింగ్ అండ్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ కె కృతివాసన్ సంవత్సరానికి రూ.4.3 కోట్లకు పైగా వేతనాన్ని అందుకున్నారు. రూ.1 కోటి జీతం అందుకుంటున్న వారిలో అత్యధిక వయస్కులు ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ బరీంద్ర సన్యాల్ (72) ఉద్యోగిగా ఉండగా, అతి తక్కువ వయస్సు కలిగిన వారు 40 ఏళ్లు. ఇన్ఫోసిస్‌లోరూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య 60గా ఉంది.

M-capలో టీసీఎస్ టాప్!

M-capలో టీసీఎస్ టాప్!

ఇదిలా ఉండగా, టాప్ 10 ఇండియన్ కంపెనీల్లో ఆరు కంపెనీల మార్కెట్ వ్యాల్యూ గత వారం రూ.34,250.18 కోట్లు పెరిగింది. లాభాల్లో టీసీఎస్ షేర్ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), ITC, ఇన్ఫోసిస్, SBI, ICICI బ్యాంక్ ఉన్నాయి. HDFC బ్యాంక్, HUL, HDFC, కొటక్ మహీంద్రా బ్యాంక్ నష్టపోయాయి.

TCS ఎం-క్యాప్ రూ.27,523.74 కోట్లు పెరిగి రూ.8,45,149.61కోట్లకు చేరుకుంది.

ఐటీసీ వ్యాల్యుయేషన్ రూ.2,513.02 కోట్లు పెరిగి రూ.3,40,728.67 కోట్లకు చేరుకుంది. SBI ఎం-క్యాప్ రూ.1,963.42 కోట్లు పెరిగి రూ.3,06,872.77 కోట్లుగా ఉంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.1,045.95 కోట్లు పెరిగి, రూ.8,34,819.67 కోట్లుగా ఉంది.

ఐసీఐసీఐ బ్యాంక్ రూ.745.32 కోట్లు పెరిగి రూ.2,69,593.17 కోట్లుగా ఉంది.

ఇన్ఫోసిస్ వ్యాల్యుయేషన్ రూ.458.73 కోట్లు పెరిగి రూ.3,23,475.68 కోట్లుగా ఉంది.

ఇక, కొటక్ మహీంద్రా ఎం-క్యాప్ రూ.7,359.21 కోట్లు తగ్గి రూ.2,81,349.02 కోట్లుగా ఉంది. HDFC ఎం-క్యాప్ విలువ రూ.4,444.12 కోట్ల నుంచి రూ.3,75,944.90 కోట్లకు పడిపోయింది. HDFC Bank రూ.3,151.75 కోట్లు తగ్గి రూ.6,64,855.29 కోట్లుగా ఉంది. హిందుస్తాన్ యూనివర్ లిమిటెడ్ రూ.1,439.59 కోట్లు తగ్గి రూ.3,95,065.37 కోట్లుగా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+