For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రోజే లాస్ట్: రూ.999కే విమాన టిక్కెట్: ఏ రూట్లో ఎంత ధర అంటే?

|

ఇండిగో... విమాన టిక్కెట్స్‌పై సరికొత్త ఆఫర్లు ఇస్తోంది. సమ్మర్ సేల్ పేరుతో నాలుగు రోజుల పాటు ప్రత్యేకంగా ఆఫర్ ప్రకటించింది. ఇండిగో సమ్మర్ సేల్ ఆఫర్‌కు ఈ రోజు (14 జూన్) లాస్ట్. ఈ రోజుతో ఈ బుకింగ్స్ ముగిసిపోనున్నాయి. ఈ ఆఫర్ కింద డొమెస్టిక్ నెట్ వర్క్‌లలో రూ.999, ఓవర్సీస్ రూట్‌లలో రూ.3,499కే ఇస్తున్నాయి.

జూన్ 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ మధ్య ప్రయాణానికి ఈ సేల్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద ఇండిగో దాదాపు 10 లక్షల టిక్కెట్స్ విక్రయిస్తోంది.

ఈ ఆఫర్ కింద ఇండిగో విమాన టిక్కెట్ల ధరలు ఢిల్లీ-అహ్మదాబాద్ మార్గంలో రూ.1,799 నుంచి, ఢిల్లీ-బెంగళూరు మార్గంలో రూ.3,299, ఢిల్లీ-చండీగఢ్ మార్గంలో రూ.1,299, ఢిల్లీ-జైపూర్ మార్గంలో రూ.1,499 , జైపూర్-ఢిల్లీ మార్గంలో రూ.1,799, గోవా-హైదరాబాద్ మార్గంలో రూ.1,499, హైదరాబాద్-బెంగళూరు మార్గంలో రూ.1,899, ఢిల్లీ-డెహ్రాడూన్ మార్గంలో రూ.1,999 ప్రారంభ ధరగా ఉంది.

రూ.21,000 లోపు ఉద్యోగులకు గుడ్‌న్యూస్రూ.21,000 లోపు ఉద్యోగులకు గుడ్‌న్యూస్

IndiGo offers flight tickets from Rs.999 in new flash sale

ఇంటర్నేషనల్ రూట్స్ అయితే ఢిల్లీ-అబుదబీ రూ.6,799, బెంగళూరు-బ్యాంకాక్ రూ.6,899, కోల్‌కతా-బ్యాంకాక్ రూ.5099, హైదరాబాద్-దుబాయ్ రూ.8,999, ఢిల్లీ-దుబాయ్ రూ.7,799, ఢిల్లీ -కౌలాలంపూర్ రూ.6,599గా ఉంది.

ఇండస్ఇండ్ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపితే రూ.2,000 వరకు లేదా 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తోంది. క్యాష్ బ్యాక్ కావాలంటే మినిమం ట్రాన్సాక్షన్ వ్యాల్యూ ర.4,000గా ఉండాలి.

ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు అయితే 5 శాతం లేదా రూ.1,000 వరకు క్యాష్ బ్యాక్. దీనికి మినిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ రూ.6,000. మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా చెల్లింపులు జరిపితే 15 శాతం లేదా రూ.800 క్యాష్ బ్యాక్ వస్తుంది.

English summary

ఈ రోజే లాస్ట్: రూ.999కే విమాన టిక్కెట్: ఏ రూట్లో ఎంత ధర అంటే? | IndiGo offers flight tickets from Rs.999 in new flash sale

In one of its largest-ever discounted ticket schemes, budget carrier IndiGo has put one million seats up for grabs with fares starting at ₹999 across its domestic network. Today is the last day of booking under IndiGo's summer sale.
Story first published: Friday, June 14, 2019, 13:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X