వాషింగ్టన్: చైనా మొబైల్ దిగ్గజం హువావేపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు హువావేను దూరం పెడతామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో హువావే కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. తమ సొంత ఆపరేటింగ్ సిస్టంను త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. తమను తక్కువగా అంచనా వేయవద్దని, ఆండ్రాయిడ్‌కు ప్రత్యామ్నాయంగా హాంగ్‌మెంగ్ పేరుతో కొత్త ఓఎస్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.
హువావే హాంగ్‌మెంగ్ ఓఎస్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలో తమ ఫోన్లలో ఆండ్రాయిడ్ స్థానంలో గ్లోబల్‌గా దీనిని అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపింది. హాంగ్‌మెంగ్ ఆపరేటింగ్ సిస్టంను ఇప్పటికే చైనాలో మిలియన్‌కు పైగ స్మార్ట్‌ఫోన్లలో వినియోగిస్తున్నారని, త్వరలో ట్రేడ్ మార్క్ సాధిస్తామని హువావే టెక్నాలజీస్ కో లిమిటెడ్ పబ్లిక్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ విలియమ్స్ తెలిపారు.

ప్రస్తుతం హువావే ఫోన్లు గూగుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం వర్షన్‌తో రన్ అవుతున్నాయి. తమ ఫోన్లకు ఆండ్రాయిడ్ సేవలు పూర్తిగా నిలిపివేస్తే ఆలోచిస్తామని, అప్పటి వరకు హాంగ్‌మెంగ్ లాంచ్ విషయం చెప్పలేమని హువావే అంతకుముందు తెలిపింది. ఇప్పుడు కొత్త తమ ఆపరేటింగ్ సిస్టంను లాంచ్ చేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.
ప్రస్తుతం అమెరికా కంపెనీలైన గూగుల్, యాపిల్‌కు చెందిన ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మార్కెట్‌ను ఏలుతున్నాయి. హువావే 2012 నుంచి సొంత ఆపరేటింగ్ సిస్టం పైన పని చేస్తోందని పలు నివేదికలు వెల్లడించాయి. తాజా ప్రకటనతో అమెరికా ప్రభుత్వంతో గూగుల్, యాపిల్ కంపెనీలకు షాక్ అని చెప్పవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications