For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్ లోన్ బ్యాలెన్స్ ను బదిలీ చేసుకోవాలనుకుంటున్నారా?

By Jai
|

హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనుకున్న వారు ఏళ్ల తరబడి రుణ వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులకు కటకట ఉన్న సమయంలో ఈ వాయిదాలు చెల్లించలేని పరిస్థితి చాలామందికి ఎదురవుతుంది. వడ్డీ రేటు తగ్గితే వాయిదా భారం కాస్తయినా తగ్గుతుందని చకోర పక్షుల్లా ఎదురు చూసే వారు ఎందరో ఉంటారు. భారత రిజర్వు బ్యాంకు రేపో రేటును తగ్గిచగానే తమ బ్యాంకు వడ్డీ రేటును ఎంత తగ్గించిందో అని వెతికే వారు కోకొల్లలు. కాస్త వడ్డీ రేటును తగ్గించినా ఎంతో సంబరపడిపోతారు. అయితే కొన్ని బ్యాంకులు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కాస్త తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణాలను అందజేస్తుంటాయి. అధిక వడ్డీ రేటుకు రుణం తీసుకున్న వారు ఇలాంటి బ్యాంకు నుంచి ఎందుకు రుణం తీసుకోలేదా అని అనుకుంటారు. కొంత బాధ కూడా పడతారు. ఇలాంటి వారు తమ రుణంలో మిగతా సొమ్మును తక్కువ వడ్డీ రేటుకు రుణం ఇచ్చే ఆర్ధిక సంస్థలకు మారిపోవచ్చు. అయితే ఇలాంటి సమయంలో కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అవేమిటంటే.

eSIMతో ఇక పోర్టబులిటీ ఎంతో సులభం: ఏమిటిది, ఎవరికి ఇబ్బందులు?eSIMతో ఇక పోర్టబులిటీ ఎంతో సులభం: ఏమిటిది, ఎవరికి ఇబ్బందులు?

హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ

హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ

- మీరు రుణం తీసుకున్నఆర్ధిక సంస్థ ఎక్కువ వడ్డీ రేటును మీ దగ్గరి నుంచి వసూలు చేసినప్పుడు మాత్రమే మీరు గృహ రుణ మిగులు బదిలీ గురించి ఆలోచించడం మంచిది. ఇలా బదిలీ చేసుకున్నప్పుడు మీకు ఎక్కువ సొమ్ము ఆదా అవుతుందనుకుంటే ట్రాన్స్ ఫర్ కు మొగ్గుచూపవచ్చు.

- హోమ్ లోన్ బాలన్సును బదిలీ చేసుకునే సమయంలో మీ క్రెడిట్ చరిత్ర, క్రెడిట్ స్కోర్ వంటి వాటికి బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తుంటాయి. కాబట్టి బదిలీకి ముందు ఇలాంటి అంశాలపై దృష్టి సారించాలి.

- హోమ్ లోన్ బ్యాలన్స్ ను మరో బ్యాంకుకు బదిలీ చేసుకోవడానికి ఎక్కువ సమయమే పడుతుంది. కనీసం 15-20 రోజుల కాలంలో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది.

- గృహ రుణ బదిలీకి ప్రాసెసింగ్ ఫీజుకు వసూలు చేస్తారు. దీనిపై జీఎస్టీ కూడా ఉండవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు 0.5 శాతం నుంచి 1 శాతం వరకు ఉంటుంది.

ఇవి ముఖ్యమే

ఇవి ముఖ్యమే

- రుణ బ్యాలన్సును బదిలీ చేసుకునే ముందు ఒక్కసారి వివిధ బ్యాంకులు ఇలాంటి వాటిపై వసూలు చేస్తున్న వడ్డీ రేట్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. బ్యాంకులు ప్రకటించే వడ్డీ రేటు, వసూలు చేసే వడ్డీ రేటులో తేడా ఉంటే మీరు మళ్ళీ ఆర్థికంగా ఇబ్బంది పడక తప్పదు. అందుకే ఏవైనా అనుమానాలు ఉంటే బ్యాంకు అధికారులను అడిగి నివృత్తి చేసుకోండి.

- తక్కువ వడ్డీ రేటు ఉంటుంది కదా అని చూడకుండా ఆయా బ్యాంకులు ఇచ్చే సర్వీసులు ఏవిదంగా ఉన్నాయో కచ్చితంగా తెలుసుకోండి. లేకపోతే తర్వాత మీరే ఇబ్బంది పడవలసి వస్తుంది.

ఇవి అవసరం

ఇవి అవసరం

- గృహ రుణ బదిలీని కూడా బ్యాంకులు కొత్త రుణ దరఖాస్తు మాదిరిగానే పరిగణిస్తారు. కాబట్టి ఇంతకు ముందు మీరు రుణం కోసం ఇచ్చిన అన్ని డాక్యూమెంట్లను ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ప్రాసెస్ పూర్తి అవుతుంది.

- రుణ బదిలీ దరఖాస్తు కోసం రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, పూర్తి చేసిన దరఖాస్తుకు జోడించాలి.

- గత మూడు నెలల వేతన స్లిప్పులు.

- ఆరు నెలల బ్యాంకు స్టేట్ మెంట్

- గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు (పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐ డీ కార్డు)

- చిరునామా ధ్రువీకరణ పత్రంతోపాటు బ్యాంకులు మరికొన్ని ధ్రువ పాత్రలను కూడా అడుగుతాయి.

గృహ రుణ బదిలీ చేసుకొమ్మని బ్యాంకులు ఆఫర్లు ఇస్తుంటాయి. ఇలాంటి ఆఫర్లు ఉన్న సమయంలో నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనము పొందవచ్చు.

English summary

హోమ్ లోన్ బ్యాలెన్స్ ను బదిలీ చేసుకోవాలనుకుంటున్నారా? | How to transfer Home Loan balance?

In case of a home loan balance transfer, you will have to request for all the refinance loan documents that you had already submitted to your present lender.
Story first published: Friday, June 14, 2019, 16:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X