బంగారం ధరలు శుక్రవారం నాడు పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు, కొనుగోళ్లకు డిమాండ్ ఉండటంతో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. బంగారం క్రమంగా పెరుగుతూ రూ.34 వేలకు చేరువైంది. శుక్రవారం ఒక్కరోజే రూ.300 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.33,870 పలికింది.
వెండి ధర కూడా పెరిగింది. నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఎక్కువ కావడంతో ఒక్కరోజు రూ.550 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.38,400గా ఉంది. మరోవైపు, డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం రూ.69.59 వద్ద ఉంది. అంతకుముందు రోజు... అంటే గురువారం నాడు డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.51 వద్ద ముగిసింది. ఈ రోజు 8 పైసలు తగ్గింది.

ఇదిలా ఉండగా, మార్కెట్లు మళ్లీ నష్టపోయాయి. ఒమన్ దేశంలో రెండు చమురు నౌకలపై దాడి నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇవి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేశాడు. పైగా అంతర్జాతీయ మార్కెట్లు కూడా బలహీనంగా ఉన్నాయి. దీంతో శుక్రవారం షేర్లు కుప్పకూలాయి.
150 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్ ఆ తర్వాత ఏ దశలో కూడా కోలుకోలేదు. చివరి గంటల్లో బ్యాంకింగ్, ఆటో, ఫార్మా, లోహ, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడితో భారీగా నష్టపోయాయి. దీంతో ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 289 పాయింట్లు దిగజారి 39,452 వద్ద, నిఫ్టీ 91 పాయింట్ల నష్టపోయి 11,823 వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.75గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications