ప్రస్తుతం దేశమంతా ఐసీసీ వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. ఈ ప్రపంచ కప్‌ను అన్ని కంపెనీలు బిజినెస్ చేసుకోవాలని భావిస్తాయి. పలు కంపెనీలు వరల్డ్ కప్ పేరుతో ఆఫర్లు ఇస్తారు. ఇందులో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దాదాపు 60 శాతం వరకు డిస్కౌంట్ సేల్స్ ఆఫర్ చేస్తోంది. వరల్డ్ కప్ మానియా పేరుతో జూన్ 13వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు ఆఫర్ ఇస్తోంది. నాలుగు రోజుల పాటు ఇచ్చే ఈ ఆఫర్స్‌లో షియోమీ, థామ్సన్, వియూ, ఇఫాల్కన్ తదితర కంపెనీల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

డిస్కౌంట్‌లో టీవీలు
ఈ ఉత్పత్తుల మీద అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుతో పది శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఉంది. ఈ ఆఫర్ కనీసం రూ.7,999 విలువ కలిగిన ట్రాన్సాక్షన్ పైన ఉంది. కొనుగోలుదారులు గరిష్టంగా రూ.2,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. MarQ స్మార్ట్ టీవీలను మంచి ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. కొడాక్, ఎల్జీ, శాంసంగ్ టీవీలు కూడా డిస్కౌంట్‌లో అందుబాటులో ఉన్నాయి.

షియోమీ స్మార్ట్ టీవీలు
32 అంగుళాల డిస్‌ప్లే కలిగిన Mi LED Smart TV 4A Pro టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,999కి వస్తుంది. 43 అంగుళాల మోడల్ రూ.22,999కి వస్తుంది. 43 అంగుళాల మోడల్ రూ.29,999గా ఉంది. 55 అంగుళాల మోడల్ టీవీ రూ.39,999గా ఉంది. Mi TVల ధరలు రూ.12,999 నుంచి రూ.47,999 వరకు ఉన్నాయి.

Vu అల్ట్రా స్మార్ట్ టీవీ
Vu Smart TV 33 శాతం డిస్కౌంట్‌తో రూ.17,999కి వస్తుంది. దీని అసలు ధర రూ.27,000. స్పీకర్ ఔట్‌పుట్ 20వాట్. 32 అంగుళాల నుంచి 65 అంగుళాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 32 అంగుళాల టీవీ రూ.11,999, 55 అంగుళాల HD TV రూ.36,999, 65 అంగులాల మోడల్ టీవీ రూ.1,29,999.

iFFALCON స్మార్ట్ టీవీలు
ఫాల్కన్ స్మార్ట్ టీవీలు 32 అంగుళాల నుంచి 75 అంగుళాల వరకు లభిస్తాయి. ఇందులో 32 అంగుళాల మోడల్ రూ.11,999. 75 అంగుళాల ప్రీమియం మోడల్, 4K UHD రిసొల్యూషన్ టీవీ రూ.1,49,999. వీటికి ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఇస్తోంది.

థామ్సన్ స్మార్ట్ టీవీ
థామ్సన్ ఇటీవలే 4 కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టెలివిజన్లను ఇండియాలో ప్రవేశపెట్టింది. ఈ కంపెనీలో మొత్తం 8 మోడల్స్ ఉన్నాయి. తక్కువ ధర కలిగిన HD ready 32 inch టీవీ రూ.10,999కి వస్తుంది. 55 అంగుళాల -4KHDR డిస్‌ప్లే కలిగిన ప్రీమియం మోడల్ రూ.33,999. ఫ్లిప్‌కార్ట్ వీటికి ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications