హైదరాబాద్: రెండు మూడేళ్ళ క్రితం వరకు ఓ వెలుగు వెలిగిన పతంజలి ఆయుర్వేదకి అసలేమైంది? యోగ గురు రాందేవ్ బాబా ప్రచార కర్తగా వ్యవహరించిన పతంజలి ఆయుర్వేద దేశంలో ఒక సంచలనమే సృష్టించింది. ప్రాచీన ఆయుర్వేద మేళవింపు తో దేశీ బ్రాండ్ గా ప్రజల ముందుకు వచ్చిన పతంజలి ... అమ్మకాల్లో రికార్డులను తిరగ రాసింది. 2006లో బాబా రాందేవ్ సహకారం తో అయన అనుచరుడు, వ్యాపార భాగస్వామి ఐన బాలకృష్ణ పతంజలి ఆయుర్వేదము స్థాపించారు. కానీ 2010 తర్వాత ఈ బ్రాండ్ కు క్రమంగా ప్రజల్లో ఆదరణ పెరుగుతూ వచ్చింది. బాబా రాందేవ్ తన యోగ టీవీ ద్వారా అత్యంత జనాదరణ పొందటంతో సహజంగానే పంతంజలి కి క్రేజ్ పెరిగింది.
అయితే ఏడాదిన్నర కాలంగా పతంజలి అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయట. ఒకానొక సమయంలో బహుళజాతి దిగ్గజాలు, దేశీయ హేమాహేమీ కంపెనీలు ఐన హిందూస్తాన్ యూనీలీవర్, కోల్గేట్ పామోలిన్, ఐటీసీ, నెస్లే వంటి కంపెనీలకు ముచ్చెమటలు పట్టించింది. పతంజలి దెబ్బకు ఈ కంపెనీలు సైతం ఆయుర్వేద ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశ పెట్టాయి. స్వయంగా బాబా రాందేవ్ పంతంజలి టర్నోవర్ ఏకంగా 10,000 కోట్ల నుంచి 20,000 కోట్లకు చేరుతుందని ప్రకటించారు. అంటే కాకుండా, అనేక ఇతర రంగాల్లోకి ప్రవేశిస్తున్నట్లు పేర్కొన్నారు. జీన్స్, నూడుల్స్, సిం కార్డ్స్, ఫోన్స్ సహా విభిన్న రంగాల్లోకి ప్రవేశం ఖాయం చేసారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలు అయినట్లుంది. ఇక కాలంలో అతి వేగంగా విస్తరించడంతో కొన్ని రంగాల్లో ఎదురైనా ఇబ్బందుల వాళ్ళ పూర్తిగా కంపెనీలో సమన్వయము కొరవడిందని, ఫలితంగా లాజిస్టిక్స్, స్టాక్స్ ఇబ్బందులు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఆలస్యం అవటం కంపెనీకి శాపంగా మారాయట.

దెబ్బతీసిన నోట్ల రద్దు, జీఎస్టీ..
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకొన్న నిర్ణయం దేశంలో అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే... పతంజలిపై కూడా పడిందట. ఆ నిర్ణయం తో వినియోగదారుల కొనుగోలు సరళి మారిందని, ఆ ప్రభావం తమపైనా పడిందని పతంజలి తన వార్షిక నివేదికలో పేర్కొన్నట్లు రాయిటర్స్ వార్త సంస్థ తన కథనంలో పేర్కొంది. అలాగే జీఎస్టీ అమల్లోకి రావటంతో ముడి సరుకులు, వివిధ ఉత్పత్తుల ధరలు ప్రభావితం అయ్యాయని, దాని ప్రభావమూ అమ్మకాలపై కనిపించిందని కంపెనీ తెలిపింది. తద్వారా... 20,000 కోట్లకు చేరాల్సిన కంపెనీ టర్నోవర్ 2017-18 లో 10% మేరకు తగ్గి కేవలం రూ 8,100 కోట్లకు పరిమితం అయిందని, గతేడాది 9 నేలల కాలానికి అమ్మకాలు మరింత క్షీణించి కేవలం రూ 4,700 కోట్లకు పడిపోయినట్లు రాయిటర్స్ పేర్కొంది.

ఉద్యోగుల తొలగింపు...
దేశవ్యాప్తంగా 3,500 డిస్ట్రిబ్యూటర్స్, 47,000 రిటైలర్స్ తో కళకళలాడిన పతంజలి కంపెనీలో దాదాపు 25,000 మంది ఉద్యోగులు ఉండేవారట. అయితే, అమ్మకాలు నెమ్మదించటంతో అందులో కొంత మందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. అయితే, వేగంగా విస్తరించటంతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా మాట వాస్తవమే అని ఒప్పుకొన్న పతంజలి యజమాని బాలకృష్ణ కంపెనీ భవిష్యత్ మాత్రం బాగుంటుందని తెలిపారని రాయిటర్స్ వెల్లడించింది. పతంజలి ఆయుర్వేద లో బాలకృష్ణకు 98% వాటా ఉంది. 4 బిలియన్ డాలర్స్ పైగా సంపదతో ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితాలో బాలకృష్ణకు చోటు లభించిన విషయం గమనార్హం. దేశంలో దూకుడుగా ఉన్నప్పుడు పతంజలి విదేశాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని ప్రకటించైనా .. ఇప్పుడు ఇల్లు చక్క దిద్దుకొనేందుకే పతంజలి కొంత సమయం పట్టేలా ఉంది.

తగ్గిన ప్రకటనలు
అమ్మకాలు భారీగా ఉన్నప్పుడు ప్రకటనలు అధికంగా ఇచ్ఛే సంస్థల్లో దేశంలోనే పతంజలి నాలుగో స్థానంలో నిలిచింది. కానీ రెండేళ్లలో ఈ కంపెనీ పదో స్థానంలో కూడా లేదని తెలుస్తోంది. అమ్మకాలపై కమిషన్ తక్కువగా ఉండటం కూడా కంపెనీకి వ్యతిరేక ఫలితాలను తీసుకొచ్చినట్లు రిటైలర్స్ పేర్కొంటున్నారు. ప్రముఖ బ్రాండ్స్ తో పోల్చితే పతంజలి కమిషన్ చాల తక్కువగా ఉండటంతో రిటైలర్స్ స్టాక్స్ మైంటైన్ చేయలేదని సమాచారం. అలాగే, పతంజలి అమ్మకాలు ట్రాక్ చేసే మెరుగైన సాఫ్ట్వేర్ లేకపోవటమా మైనస్ అయ్యిందట.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications