For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీలంకలో టూరిజం ఇప్పుడు డెడ్ ఛీప్ ! మీరు ఊహించనంత

By Chanakya
|

శ్రీలంక.. బడ్జెట్లో ఉన్న మంచి పర్యాటకధామం. తక్కువ బడ్జెట్‌లో వెళ్లొచ్చని ఎక్కువ మంది ఎంపిక చేసుకునే ప్లేస్ ఇదే. ఇండియన్స్‌తో పాటు యూరోపియన్స్, రష్యన్స్‌ కూడా శ్రీలంకను ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. సువిశాలమైన, ఎక్కువగా జనసాంద్రత లేని బీచ్‌లు, పురాతన బౌద్ధ ఆలయాలు, దట్టమైన అడవులు, కొండలు, జలపాతాలు ఈ దేశ సొంతం.
అయితే ఈ మధ్య జరిగిన దాడుల్లో ఆ దేశ పర్యాటకం కకావికలమైంది. ఏప్రిల్ 21న జరిగిన దాడుల్లో ఏకంగా 250 మంది ప్రాణాలొదిలారు. అందులో సుమారు 40 మంది విదేశీయులూ ఉన్నారు. దీంతో అప్పటి నుంచి ఆ దేశంలోకి అడుగుపెట్టాలంటేనే టూరిస్టులు జంకుతున్నారు. అందుకే అద్భుతమైన ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది ఇప్పుడు శ్రీలంక.

ఇక ఇంటింటికీ రిలయన్స్ గ్యాస్ ! లైన్ క్లియర్ అయితే...ఇక ఇంటింటికీ రిలయన్స్ గ్యాస్ ! లైన్ క్లియర్ అయితే...

రూములు ఖాళీ...

రూములు ఖాళీ...

శ్రీలంకకు టూరిజం ద్వారా అధిక ఆదాయం వస్తుంది. వాళ్ల దేశ జీడీపీలో దీని వాటా 5 శాతమంటే ఏ స్థాయిలో రాబడి ఉంటుందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మధ్యపడిన దెబ్బతో ఇంగ్లండ్, యూఎస్, ఇండియా వంటి దేశాలు ట్రావెల్ ఎలర్ట్స్ ప్రకటించాయి. ఆ దేశంలో పర్యటన రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని ప్రకటించాయి. దీంతో చాలా మంది వెనక్కి తగ్గారు. గతంలో బుకింగ్ చేసుకున్న వాళ్లు కూడా రూములు, ఫ్లైట్స్‌ను రద్దు చేసుకున్నారు. ఆక్యుపెన్సీ పది శాతానికి పడిపోయింది. సాధారణంగా ఇలాంటి సీజన్‌లో కనీసం 30 శాతానికి తగ్గకుండా జనాలు అక్కడికి వెళ్తారు. ఇక చేసేది లేక భారీ ఆఫర్లను ప్రకటించింది శ్రీలంక టూరిజం.

ఆఫర్లే ఆఫర్లు

ఆఫర్లే ఆఫర్లు

ప్రభుత్వానికి చెందిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హోటల్స్, పర్యాటక శాఖతో కలిసి కాంబో ప్యాకేజీలను అందిస్తోంది. హోటల్స్ కూడా నాలుగు అడుగులు ముందుకేసి పర్యాటకును ఆకర్షించే పనిలో ఉన్నాయి. ఉదాహరణకు హిక్కాదువాలో ఉన్న లవాంగా రిసార్ట్స్ అండ్ స్పా... రోజుకు ఒకప్పుడు 75 డాలర్లు (రూ.5250) వరకూ ఛార్జ్ చేసేది. ఇప్పుడది 35 డాలర్లకు(రూ.2450) కుదించారు. ఇలా ఎన్నో ఆఫర్లు క్యూకట్టాయి. అందుకే వివిధ దేశాల్లో ఉన్న టూర్ ఆపరేటర్లు దీన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారని అక్కడి టూరిజం శాఖ చెబ్తోంది. ఇంకొన్ని లగ్జరీ హోటల్స్ ఆరు రోజులకు బ్రేక్‌ఫాస్ట్, స్పా ట్రీట్మెంట్స్‌తో కలిపి 200 డాలర్లలోపే (రూ.15000) వసూలు చేస్తున్నాయని వెబ్ సైట్స్ సూచిస్తున్నాయి.

1000 మందే..

1000 మందే..

సాధారణంగా శ్రీలంకకు ప్రతీ రోజూ 4000-4500 మంది పర్యాటకులు వివిధ దేశాల నుంచి వస్తూ ఉంటారు. అయితే ఘటన జరిగిన వెంటనే ఈ సంఖ్య 1000కి పడిపోయింది. కానీ కొద్దిగా తేరుకుని ఇప్పుడు ఆ సంఖ్య 1400 వరకూ చేరిందని శ్రీలంక టూరిజం బ్యూరో అధిపతి కిషు జోమ్స్ చెబ్తున్నారు. చైనా, ఇండియా వంటి దేశాలు తమ దేశస్తులకు కొద్దిగా భరోసా ఇచ్చి ట్రావెల్ అడ్వైజరీని పూర్తిగా తొలగిస్తే పరిస్థితుల్లో మరింతగా మార్పు వస్తుందని ధీమాగా ఉంది ఆ దేశ టూరిజం బోర్డ్.

సో.. పరిస్థితులు కాస్త భయంకరంగా అనిపించినా.. రిస్క్ తీసుకుని వెళ్లేవాళ్లకు శ్రీలంక మంచి ఆఫర్లను అందిస్తోంది. వీలైతే.. ఓసారి ట్రై చేయండి. లేకపోతే ధరలు ఎంత తక్కువగా ఉన్నాయో అనైనా ఓ లుక్ వేయండి.

English summary

శ్రీలంకలో టూరిజం ఇప్పుడు డెడ్ ఛీప్ ! మీరు ఊహించనంత | Travel companies are cutting prices to lure tourists back to Sri Lanka

Srilanka tourism board is offering rock bottom prices to lure tourists into their country after deadly attack last month. Along the tour operators and hotels offering discounts, now travel has become cheap to srilanka.
Story first published: Wednesday, June 12, 2019, 7:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X