న్యూఢిల్లీ: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఎన్నికలకు ముందు సీఎం నవరత్నాలు ప్రకటించారు. అందులో భాగంగా రైతుల కోసం వైయస్సార్ భరోసా పథకాన్ని తీసుకు వచ్చారు. ఈ పథకంపై స్వామినాథన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ సీఎంకు లేఖ రాశారు.

జగన్‌కు సాయం చేసేందుకు నేను సిద్ధం
సంక్షోభంలో ఉన్న రైతుల్లో ఈ పథకం మనోధైర్యం నింపిందని స్వామినాథన్ పేర్కొన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని పలుమార్లు కలిసి రైతాంగం కోసం ఆయనతో కలిసి పని చేశానని చెప్పారు. మీ నాయకత్వంలో రైతుల కోసం చేపట్టే కార్యక్రమాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. వ్యవసాయపరంగా ఉన్న అశాంతికి కారణమైన అంశాలను పరిష్కరించేందుకు జగన్ గట్టిగా దృష్టి సారించారనుకోవడానికి ఇది సరైన చర్యగా అభివర్ణించారు. ఆర్థికంగా, జీవావరణ పరంగా రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు జగన్ తీసుకువెళ్లగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.రైతు సమస్యల పరిష్కారంలో జగన్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను సిద్ధమన్నారు.

జగన్ కీలక నిర్ణయం
ఇటీవల రైతుల కోసం జగన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం తెచ్చిన అన్నదాతా - సుఖీభవ రద్దు చేసి, కొత్తగా రైతు భరోసా స్కీంను తీసుకు వచ్చారు. ఈ పథకం కింద పంటసాగుకు రూ.12,500 ఇవ్వనున్నారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి దీనిని ప్రారంభించనున్నారు. రూ.3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నారు. విపత్తుల నిధికి రూ.2వేల కోట్లు కేటాయిస్తారు. ప్రమాదవశాత్తూ రైతు చనిపోతే రూ.7 లక్షల బీమా ఉంటుంది. పైల రైతులకు లీటరుకు రూ.4 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, పంట బీమా ప్రీమియం రైతులు ఒక్క పైసా చెల్లించకుండా, ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. రైతులకు నష్టం చేసే నకిలీ విత్తనాలపై కూడా చర్యలు తీసుకుంటానని చెప్పారు.

నాలుగేళ్ళకు ఒక్కో రైతుకు రూ.50వేల ప్రయోజనం
అర్హులైన రైతులకు నాలుగేళ్ల పాటు.. ఏడాదికి రూ.12,500 చొప్పున మొత్తం రూ.50వేలు ఇస్తానని జగన్ ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంలో పది సెంట్ల నుంచి అయిదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రూ.15వేలు ఇచ్చారు. అంటే అయిదేళ్లలో రూ.75 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.6వేలు కూడా ఉంది. దీంతో కలిపి రూ.15వేలు. తెలంగాణలో రైతులకు ఎకరాకు రూ.4,500 చొప్పున చెల్లిస్తున్నారు.

ప్రభుత్వంపై రూ.13,125 కోట్ల భారం
రైతు భరోసా పథకంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.13,125 కోట్ల భారం పడనుందని అంచనా. ఇదిలా ఉండగా, ప్రతి అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గంలో 200 బోర్‌వెల్స్ ప్రొవైడ్ చేయాలని కూడా జగన్ అధికారులను ఇటీవల ఆదేశించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌస్‌లు నిర్మించాలని ఆదేశించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications