KG D6 బ్లాక్‌లో 3 క్షేత్రాల్లో రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి, 35,000 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సమీపంలోని కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామి.. బ్రిటన్‌కు చెందిన బీపీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఈ రెండు కంపెనీలు 2022 నాటికి ఈ బ్లాకుల్లో రూ.35,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నాయి.
దీని వల్ల కేజీ బేసిన్‌లోని సముద్ర జలాల్లో ఈ రెండు కంపెనీలకు ఉన్న కేజీ డీ6 బ్లాకులోని మరో మూడు క్షేత్రాల నుంచి దశల వారీగా అదనంగా రోజుకు మూడు నుంచి మూడు కోట్ల ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు. MJ ప్రాజెక్టు పేరుతో ఈ కంపెనీలు మూడు గ్యాస్ క్షేత్రాలను అభివృద్ధి చేయనున్నాయి.
MJ ప్రాజెక్టు లేదా D55 పేరుతో రిలయన్స్ - BP భాగస్వామ్యం అభివృద్ధి చేయనుంది. తమ రెండు కంపెనీలు కలిసి 3 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల మేర గ్యాస్‌ను వెలికితీయనున్నామని, ఇందుకు 5 బిలియన్ డాలర్లు అంటే, రూ.35వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. పూర్తిగా అభివృద్ధి పరిచిన తర్వాత రోజుకు 1 బిలియిన్ క్యూబిక్ ఫీట్లు న్యూ డొమెస్టిక్ గ్యాస్ వస్తుందని, ఇది 2020-2022 ఈ మేరకు ఉత్పత్తి చేస్తామన్నారు.

ప్రస్తుతం రిలయన్స్ -BPలు డీ1, డీ3 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాయి. వీటికి సమీపంలోని మూడు చోట్ల కొత్తగా గ్యాస్ ఉత్పత్తి చేపట్టాలని రెండు కంపెనీలు నిర్ణయించాయి. ఈ మూడు చోట్ల మూడు లక్షల క్యూబిక్ ఫీట్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు గుర్తించాయి.
రిలయన్స్ ఇప్పటి వరకు 19 చోట్ల గ్యాస్, ఒక చోట చమురు నిల్వలు కనుగొంది. 2008 నుంచి ఒకచోట చమురు, రెండు చోట్ల గ్యాస్ ఉత్పత్తి చేపట్టింది. డీ1, డీ3లలో గ్యాస్ ఉత్పత్తి 2010లో 5.4 కోట్ల క్యూబిక్ మీటర్ల నుంచి ఈ ఏడాదికి 13 లక్షల క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. మిగతా క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి చేపట్టాలంటే ప్రభుత్వం ధర పెంచాలని చెబుతోంది. ఇప్పుడు ప్రభుత్వం అంగీకరించాక అందుకు సిద్ధపడింది.


Click it and Unblock the Notifications