For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడు రోజుల ముచ్చటే ! మళ్లీ నష్టాల్లో ముగింపు

By Chanakya
|

స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. ఎట్టకేలకు చివర్లో కాస్త కోలుకుని 11900 పాయింట్లపైన ముగిసింది నిఫ్టీ, మెటల్స్, ఎఫ్ఎంసిజి మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలో సెల్లింగ్ ప్రెషర్ స్పష్టంగా నమోదైంది. ఉదయం 11962 పాయింట్ల దగ్గర స్థిరంగా ప్రారంభమైన నిఫ్టీ మిడ్ సెషన్ నాటికి బాగా బలహీనపడింది. ఒక దశలో పీక్ నుంచి వంద పాయింట్లు కోల్పోయి 11866 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. అయితే ఆఖర్లో కొద్దిగా కోలుకోవడం కలిసొచ్చింది. కనిష్ట స్థాయిల దగ్గర కొన్ని కౌంటర్లలో బయింగ్ సపోర్ట్ లభించింది. దీంతో చివరకు 60 పాయింట్ల నష్టంతో 11906 దగ్గర నిఫ్టీ, 194 పాయింట్ల నష్టంతో 39,757 దగ్గర సెన్సెక్స్ క్లోజయింది. బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లు కోల్పోయి 30965 దగ్గర స్థిరపడింది.

టాటా స్టీల్, గెయిల్, ఓఎన్జీసీ, బ్రిటానియా, వేదంతా స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇండియాబుల్స్ హౌసింగ్, భారతి ఇన్ఫ్రాటెల్, యెస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి స్టాక్స్ లూజర్స్ జాబితాలో నిలిచాయి.

Nifty ends above 11,950, Sensex up 165 points

భారత్ డైనమిక్స్
టోర్పెడోలను సరఫరా చేసేందుకు బిడిఎల్ నిన్న భారం కాంట్రాక్టును అందుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. నిన్నే ఈ స్టాక్ పెరిగినప్పటికీ ఈ రోజు కూడా వాల్యూమ్స్‌తో సహా స్టాక్ ఎగిరి గంతేసింది. సుమారు 7 శాతం లాభంతో రూ.313.15 దగ్గర క్లోజైంది.

ఇండియాబుల్స్ మళ్లీ డౌన్
ఐబీ గ్రూప్ ఛైర్మన్ పై వార్తల నేపధ్యంలో ఇండియాబుల్స్ గ్రూప్ స్టాక్స్ మరో రోజు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. ఐబీ హౌసింగ్ 8 శాతం నష్టంతో రూ. 621దగ్గర క్లోజైంది. ఐబీ వెంచర్స్ 7 శాతం, ఐబి రియల్ 6 శాతం, ఐబి హోల్‌సేల్ 10 శాతం కోల్పోయాయి.

సింటెక్స్ ఇక అంతేనా
నిరుత్సాహక త్రైమాసిక ఫలితాలు, ఆదాయం - లాభాల్లో భారీ క్షీణత వంటి అంశాలతో కొన్ని క్వార్టర్లుగా ఇబ్బందులు పడ్తూ వస్తున్న సింటెక్స్ ఇండస్ట్రీస్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్‌ ద్వారా సమీకరించిన అసలు, వడ్డీని తిరిగి చెల్లించడంతో విఫలమైంది. 2021 మెచ్యూరిటీ ఉన్న ఈ బాండ్లలో కొన్నింటిని చెల్లించడంలో కంపెనీ డిఫాల్ట్ అయినట్టు ఎక్స్ఛేంజీలకు సమాచారం అందింది. సుమారు రూ.89 కోట్లను ఈ డిబెంచర్స్ ద్వారా గతంలో సమీకరించింది సింటెక్స్. ఈ వార్తల నేపధ్యంలో స్టాక్ మరింతగా నీరసించి రూ.4.55 దగ్గర క్లోజైంది.

యెస్ బ్యాంక్ కూడా ఇదే దారే..
యెస్ బ్యాంక్‌ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ పదవి నుంచి ముకేష్ శబర్వాల్ రాజీనామా చేయడంతో స్టాక్ మళ్లీ పతమైంది. ఈ రోజు కూడా మరో 3.5 శాతం కోల్పోయి రూ.135 దగ్గర స్థిరపడింది. మార్చి నెలలో రణ్‌వీర్ గిల్.. ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్లీ ఇప్పుడే ఇదే మొదటి రాజీనామా.

English summary

మూడు రోజుల ముచ్చటే ! మళ్లీ నష్టాల్లో ముగింపు | Nifty ends above 11,950, Sensex up 165 points

Indian indices ended on positive note but off day's high on June 11 with Nifty able to close above 11,950 level.
Story first published: Wednesday, June 12, 2019, 17:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X