రిలయన్స్ జియో.. టెలికం రంగంలో సంచలనాలు సృష్టించింది. త్వరలో ఇది బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి అడుగు పెడుతోంది. గిగా ఫైబర్ పేరుతో బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ సేవలు అతి త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. గిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు కేవలం రూ.600కే అందుబాటులోకి వస్తాయని వార్తలు వచ్చాయి. అలాగే, ఈ సేవల్ని పొందేందుకు సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించే మొత్తాన్ని కూడా జియో తగ్గించినట్లుగా వార్తలు వచ్చాయి.

సెక్యూరిటీ డిపాజిట్
గతంలో సెక్యూరిటీ డిపాజిట్ రూ.4,500గా ఉంటుందని ప్రచారం జరిగింది. దీనికి రూ.2వేలు తగ్గించనున్నరని, రూ.2,500కే కనెక్షన్ ఇస్తున్నారట. ప్రస్తుతం కొంతమందికి ప్రివ్యూ ఆఫర్ కింద ఉచితంగా జియో సేవలు అందిస్తోంది. గిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్‌లో కొన్ని మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది.

పాత ప్లాన్ ఇలా... కొత్త ప్లాన్ ఇలా...
తాజా రూ.2,500 కనెక్షన్ ప్లాన్‌తో సింగిల్ బ్యాంట్ రోటర్‌ను అందిస్తారు. పాత ప్లాన్ అయితే రూ.4,500 కనెక్షన్. దీంతో డ్యూయల్ బ్యాండ్ రోటర్ అందించారు. మొదటి రకం కనెక్షన్ కంటే రెండో రకం కనెక్షన్ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. మొదటి ప్లాన్ వేగం 50ఎంబీపీఎస్ ఉంటే, రెండో ప్లాన్ వేగం 100 ఎంబీపీఎస్ ఉండనుంది. అంటే సగం తగ్గనుంది. ఈ ప్లాన్ యూజర్లకు నెలకు 100 GB డేటాను అన్ని అదనపు కూపన్లతో కలిపి ఇస్తోందని తెలుస్తోంది.

అందుబాటులో వాయిస్ సేవలు
రూ.2,500 ప్లాన్‌లో వాయిస్ సేవలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా ఇతరులకు కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు జియో టీవీ యాప్ అందిస్తున్నారు. కొత్త సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించి జియో ప్రకటన చేయాల్సి ఉంది. రూ.2,500 ప్లాన్ 2.4GHz బ్యాండ్ విడ్త్‌ను సపోర్ట్ చేస్తుంది. రూ.4,500 ప్లాన్ 5GHz బ్యాండ్ విడ్త్‌ను సపోర్ట్ చేస్తుంది. రూ.2,500 చీపర్ ప్లాన్‌తో యూజర్లు గిగా ఫైబర్ కనెక్షన్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో టీవీ యాప్ అందుబాటులో ఉంటుంది. పాత ప్లాన్ యూజర్లకు మాత్రం వాయిస్ కాల్ సర్వీసు అందుబాటులో లేదు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications