For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.98వేల కోట్ల దుర్వినియోగం, ఇండియాబుల్స్‌కు సుప్రీం కోర్టులో షాక్

|

న్యూఢిల్లీ: స్వల్ప ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఇండియా బుల్స్ హౌసింగ్ పైనాన్స్ కంపెనీకి ఎదరుదెబ్బ తగిలింది. ఆ సంస్థ డైరెక్టర్లు, చైర్మన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఇండియాబుల్స్ వాటాదారుల్లో ఒకరైన అభయ్ యాదవ్ అనే వ్యక్తి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. రూ.98 వేల కోట్లను ఇండియా బుల్స్ చైర్మన్ సమీర్ గెహ్లాట్ దుర్వినియోగం చేస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీం అంగీకారం తెలిపింది.

జగన్‌కు సహకరిస్తా: ఎంఎస్, ప్రభుత్వంపై రూ.13,125 కోట్ల భారంజగన్‌కు సహకరిస్తా: ఎంఎస్, ప్రభుత్వంపై రూ.13,125 కోట్ల భారం

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌పై ఆరోపణలు

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌పై ఆరోపణలు

స్పెయిన్ నివాసి, ప్రవాస భారతీయుడు హరీష్ ఫాబియాని సహాయంతో డమ్మీ కంపెనీలను సృష్టించి నిధులను మళ్లించారని పిటిషన్లో అభయ్ ఆరోపించారు. ఇండియా బుల్స్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై, దాని చైర్మన్ సమీర్ గెహ్లాట్ పైన, డైరెక్టర్ల పైన లీగల్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు. ఈ సొమ్మును వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. షెల్ కంపెనీలు సృష్టించారన్నారు. ఈ షెల్ కంపెనీలకు పెద్ద మొత్తంలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రుణాలు ఇచ్చిందని, ఆ రుణాలను తమ తమ (డైరెక్టర్లు, చైర్మన్) సంస్థలకు ట్రాన్సుఫర్ చేశారన్నారు. ఈ మొత్తం స్కాం ఆడిటర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, సంబంధిత ప్రభుత్వ డిపార్టుమెంట్ అధికారులను ఒప్పించనిదే సాధ్యం కాదన్నారు. నిధుల మళ్లింపుపై చర్యలు తీసుకోవాలని, కేంద్రం, సెబి, ఆర్బీఐ, ఐటీ శాఖను ఆ దిశలో ఆదేశించాలని కోరారు. చైర్మన్‌కు పలుకుబడి ఉందని, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయన్నారు.

ఇండియాబుల్స్ స్పందన

ఇండియాబుల్స్ స్పందన

మరోవైపు ఈ పిటిషన్ పైన ఇండియాబుల్స్ యాజమాన్యం కూడా స్పందించింది. కంపెనీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కానీ పురోగతిని అడ్డుకునేందుకు ఇలా చేస్తున్నారని, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని, కంపెనీ రికార్డుల్లో ఉన్న రుణాల మొత్తం రూ.90వేల కోట్లు అని, కానీ పిటిషన్‌దారు రూ.98వేల కోట్లు దుర్వినియోగం చేసినట్లు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.

పడిపోయిన షేర్లు

పడిపోయిన షేర్లు

ఇండియాబుల్స్ డైరెక్టర్లపై ఆరోపణల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు బాగా పడిపోతున్నాయి. ఈ కంపెనీ షేర్లు ఓ సమయంలో 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయి అంటే... రూ.576.35 వద్ద మంగళవారం ముగిశాయి. బుధవారం కూడా అదే కొనసాగింది. బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 20 ఫిబ్రవరి ముందు కనిష్టానికి పడిపోయాయి. 6.54 శాతం తగ్గి, 632.60గా ఉంది.

Read more about: supreme court business shares
English summary

రూ.98వేల కోట్ల దుర్వినియోగం, ఇండియాబుల్స్‌కు సుప్రీం కోర్టులో షాక్ | Indiabulls Housing moves SC for listing of plea against it alleging misappropriation of funds

The Indiabulls Housing Finance Ltd (IHFL) Wednesday moved the Supreme Court seeking urgent listing of a plea filed against it in which it has been alleged that the company misappropriated Rs 98,000 crore of public money.
Story first published: Wednesday, June 12, 2019, 16:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X