మా టారిఫ్ దెబ్బకు చైనా దిగొచ్చింది!: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: చైనా గతంలో అంగీకరించిన ఒప్పందాలకు కట్టుబడి ఉండే వరకు కొత్తగా వాణిజ్య చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ట్రేడ్ వార్ దెబ్బకు చైనా వ్యాపారం కుదేలవుతోందని వ్యాఖ్యానించారు. ఏదో రకంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం డ్రాగన్ కంట్రీ తహతహలాడుతోందన్నారు. మనం బిలియన్ల కొద్ది డాలర్లను వసూలు చేస్తున్నామని, దీంతో కంపెనీలు చైనాను వదిలి ఇక్కడకు వచ్చేస్తున్నాయన్నారు. ఎందుకంటే ఆ కంపెనీలు టారిఫ్‌లు చెల్లించలేక వస్తున్నాయన్నారు. ఇతర దేశాలకు కూడా వెళ్తున్నాయని చెప్పారు.
ఆ కంపెనీలు మనం విధించే టారిఫ్‌లు భరించలేకున్నాయని చెప్పారు. ఈ కారణంగానే చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నారన్నారు. దీంతో అమెరికాతో ఒప్ందం కోసం చైనా తహతహలాడిపోతోందని చెబుతున్నానని, వారు టారిఫ్‌ల దెబ్బకు ఇబ్బంది పడుతున్నారన్నారు. చైనా వారి కంపెనీలకు రాయితీలు ఇస్తోందని, అందుకే మనవారు అంత మొత్తంలో చెల్లించాల్సిన అవసరం రావడం లేదన్నారు.

తమకు చైనాతో డీల్ కుదిరిందని, కానీ వారు దానిపై వెనక్కి తగ్గి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెబుతున్నారని, వాటిని కూడా తాము మార్చామని, అందుకే చైనాతో ఇప్పుడు మరో రకంగా డీల్ చేస్తున్నామని చెప్పారు. వారు తమ పాత డీల్‌కు అంగీకరించే వరకు ట్రేడ్ టాక్స్ (వాణిజ్య చర్చలు) విషయంలో తనకు ఆసక్తి లేదన్నారు.
అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ డమ్మీగా మారిపోయాడని ట్రంప్ విమర్శించారు. అమెరికాకు చైనా పోటీ కాదని ఆయన భావించి ఉంటారని, కానీ డ్రాగన్ కంట్రీ కొద్ది కాలంలోనే 500 బిలియన్ డాలర్ల ఆదాయం పొందిందని, తమకు చైనా ప్రధాన పోటీదారు అన్నారు. ఇప్పుడు ఆ దేశం ఒక వాణిజ్య ఒప్పందం కోసం తహతహలాడుతోందన్నారు. కాగా, ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే ట్రేడ్ వార్ కొనసాగేలా కనిపిస్తున్నాయంటున్నారు.
గత నాలుగైదు నెలలుగా అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. చైనాకు చెందిన 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై అమెరికా టారిఫ్ విధించింది. దీంతో డ్రాగన్ కంట్రీ కూడా అమెరికాకు చెందిన 60 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్‌లు అధికం చేసింది. అమెరికా మరిన్ని ఉత్పత్తులపై టారిఫ్ పెంచుతామని ఇప్పటికే చెప్పింది.


Click it and Unblock the Notifications