అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. G20 సమావేశంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశం లేకుంటే డ్రాగన్ దేశంపై టారిఫ్ మరింత పెరుగుతుందని హెచ్చరించాడు. ఈ భేటీ లేకుంటే మరో 300 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై టారిఫ్ విధిస్తామని చెప్పాడు.
ఈ నెలాఖరున జపాన్‌లో G20 సదస్సు జరగనుంది. చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌తో సమావేశం జరుగుతుందని తాను భావిస్తున్నానని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ అలాంటి సమావేశం జరగకపోతే కొత్త సుంకాలను విధించడం ఖాయమన్నారు.

ఈ మేరకు CNBC ఛానెల్‌తో ట్రంప్ మాట్లాడారు. G20 సదస్సుకు జిన్‌పింగ్ వెళ్తారని అనుకుంటున్నానని, ఒకవేళ వెళ్లకుంటే అది తనను ఆశ్చర్యపరిచే విషయమే అవుతుందని, అలాగని ఆయన వెళ్లకుండా ఉంటారని తాను అనుకోవడం లేదని చెప్పారు.
మరోవైపు, ఇంతవరకు జిన్‌పింగ్-ట్రంప్ భేటీకి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఒకరు ఇది వరకు చెప్పారు. జూన్ 28, 29 తేదీల్లో ఒకాసాలో G20 సమ్మిట్ జరగనుంది.
అమెరికా, చైనా మధ్య గత కొంతకాలంగా ట్రేడ్ వార్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించింది అమెరికా. ప్రతిగా డ్రాగన్ కంట్రీ 60 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా వస్తువులపై టారిఫ్ పెంచింది. మరో 300 బిలియన్ డాలర్ల చైనా వస్తువులపై టారిఫ్ విధించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ హెచ్చరించారు.
భారత్‌పై ఆగ్రహం
డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాలో ఉత్పత్తి అయి భారత్‌కు ఎగుమతి అయిన మోటార్ సైకిలుపై 100శాతం సుంకం నుంచి 50శాతం సుంకం తగ్గించినప్పటికీ అది కూడా చాలా ఎక్కువే అన్నారు. తన నాయకత్వంలో అమెరికా ఉందని ఆదేశాన్ని ఎవరూ మోసం చేయలేరన్నారు. ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడే అయినప్పటికీ అమెరికా మోటార్ సైకిళ్లపై 100శాతం సుంకం విధించడం ఎంతవరకు సబబు అన్నారు.
అమెరికాలో తయారయ్యే హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై భారత్ సుంకం విధించడాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఈ మోటార్ సైకిళ్లపై ఎలాంటి సుంకం విధించరాదన్నారు. అమెరికా భారత్‌కు హార్లీ డేవిడ్సన్ బైకులను ఎగుమతి చేస్తుండగా భారత్ 100శాతం సుంకం విధిస్తోందని అదే భారత్‌లో తయారయ్యే వాటికి మాత్రం సున్నా శాతం పన్ను ఉందన్నారు. ఈ క్రమంలోనే తాను ప్రధాని మోడీతో మాట్లాడి ఇలాంటి ఆఫర్ తమకు నచ్చలేదని చెప్పానని, ఒక్క ఫోన్ కాల్‌తో మోడీ 50శాతం సుంకం తగ్గించారన్నారు. కానీ సంతృప్తిగా లేమన్నారు. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు.
అమెరికా ధనిక దేశం కాబట్టి తమ ప్రతిపాదనపై భారత్ ఆలోచిస్తోందని ఒకవేళ ఆదేశ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రతిపాదనను పట్టించుకునే వారే కాదన్నారు. కానీ ప్రతి దేశానికి అమెరికాతో పని ఉంటుందని అందుకే అంత గౌరవం విలువ ఇస్తాయన్నారు. అంతేకాదు అమెరికా ధనిక రాష్ట్రం కనుక ఏ చిన్న అవకాశం వచ్చినా పక్క దేశాలు దండుకునేందుకు చూస్తాయన్నారు. అన్ని దేశాలకు తాము బ్యాంకులా కనిపిస్తున్నామని, ఈ బ్యాంకును దోపిడీ చేయాలని చూస్తున్నాయన్నారు.
More From GoodReturns

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు.. హార్ముజ్ జలసంధి నుంచి నిరంతరంగా చమురు సరఫరా..

రష్యా చమురు కొనాలని ప్రపంచ దేశాలను ట్రంప్ అడుక్కుంటున్నారు.. అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్..

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

ఇరాన్ యుద్ధం వేళ మరో టెన్షన్.. జపాన్ తూర్పు తీరం వైపు 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కిమ్..

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

Oil prices: జపాన్ రహస్య ఆయిల్ నిధి! ఆరు నెలలకు సరిపడా చమురుని జపాన్ ఎలా దాచిపెట్టింది?

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications