మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు సంబంధించి చాలా మంది కొత్త పాత ఇన్వెస్టర్లలలో అవగాహన లేకపోవడం వల్ల వారు తీసుకునే పెట్టుబడి నిర్ణయాలు వారికి నష్టం కలిగించే విధంగా ఉంటున్నాయి. అందుకే ఇలాంటి ఇన్వెస్టర్లకు ఉండే అపోహలను తొలగించు కోవడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకుని తమ పెట్టుబడులపై మంచి రాబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ పై ఉండే అపోహలు ఏమిటి... వాటిలో ఉండే వాస్తవం ఎంతనో తెలుసుకుందాం...

మ్యుచువల్ ఫండ్స్
అపోహ : మ్యూచువల్ ఫండ్స్ కేవలం ఈక్విటీ ఫండ్స్ లోనే పెట్టుబడి పెడతాయట..
వాస్తవం : మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లు (ఈక్విటీ షేర్లు), బంగారం, బాండ్ మార్కెట్ (కార్పొరేట్ బాండ్లు ,ప్రభుత్వ ట్రెజరీ బిల్స్, ప్రభుత్వ బాండ్లు) కంపెనీ డిపాజిట్లు, కమర్షియల్ పేపర్లు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ వంటి వాటిలో పెట్టుబడులు పెడతాయి.

ఫండ్ NAV
అపోహ : అధిక NAV కన్నా తక్కువ NAV బాగుంటుందంట..
వాస్తవం : ఫండ్ NAV అనేది మ్యూచువల్ ఫండ్ ప్రతి యూనిట్ నికర అసెట్ విలువను తెలియజేస్తుంది. గ్రోత్ ఆప్షన్ లో ఫండ్స్ పనితీరు ఆధారంగా NAV పెరుగుతుంది, తగ్గుతుంది. డివిడెండ్ ఆప్షన్ లో ప్రకటిత డివిడెండ్ లేదా ఫండ్ పనితీరు ఆధారంగా NAV ఆధార ఉంటుంది. ఫండ్ గత పనితీరు, ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ థీమ్, ఫండ్ మేనేజర్, మార్కెట్ పరిస్థితులు ఆధారంగా పెట్టుబడులు పెట్టాలి తప్ప NAV విలువను బట్టి కాదు.

పెట్టుబడి
అపోహ : మ్యూచువల్ ఫండ్స్ లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలట..
వాస్తవం : మ్యూచువల్ ఫండ్స్ లో SIP ద్వారా నెలకు రూ. 500 పెట్టుబడి కూడా పెట్టవచ్చు.

లాభాలపై పన్ను
అపోహ : మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై వచ్చే లాభాలపై పన్ను ఉంటుందట...
వాస్తవం : ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ఏడాది దాటితే దానిపై వచ్చే లాభంపై పన్ను ఉండదు. ఈ మినహాయింపుకోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తమ కార్పస్ లో కనీసం 60 శాతం ఈక్విటీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి.

డీమ్యాట్
అపోహ : డీమ్యాట్ ఖాతా తప్పనిసరిగా అవసరం
వాస్తవం : మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి ఏమీ కాదు. ఫండ్ హౌస్ వెబ్ సైట్ ద్వారా లేదా ఫైనాన్సియల్ అడ్వైజర్లు, బ్యాంకులు, బ్రోకరేజ్ సంస్థల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.

రిస్క్
అపోహ : మ్యూచువల్ ఫండ్స్ అనేవి షేర్లకన్నా ఎక్కువ రిస్క్ తో కూడుకున్నవట...
వాస్తవం : మ్యూచువల్ ఫండ్స్ విభిన్న రకాల షేర్లలో పెట్టుబడులు పెడతాయి. దీనివల్ల ఒక్కొక్క షేర్ లో పెట్టిన పెట్టుబడి వల్ల కలిగే రిస్కు కన్నా ఎక్కువ షేర్లలో పెట్టే పెట్టుబడి వల్ల రిస్క్ తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు స్టాక్ మార్కెట్ తో పాటు దేశ ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు కాబట్టి ఎప్పుడు కొనుగోళ్లు జరపాలి ఎప్పుడు విక్రయించాలి అనే దాని విషయంలో నిర్ణయాలు సరిగా ఉంటాయి.

డివిడెంట్ ఇచ్చే ఫండ్స్
అపోహ : డివిడెండ్ ఇచ్చే ఫండ్స్ మంచివట...
వాస్తవం : డివిడెండ్ ఆప్షన్ ఉంటేనే డివిడెండ్ ను ప్రకటిస్తూ ఉంటారు. డివిడెండ్ ప్రకటిస్తే అందుకు సమానంగా ఫండ్ NAV తగ్గుతుంది. డివిడెండ్ వల్ల మీకు రెగ్యులర్ గా ఆదాయం వస్తుంది. కానీ గ్రోత్ ఫండ్ లో వచ్చే ప్రయోజనం కోల్పోతారు.

SIP
అపోహ : SIP లే మంచివట...
వాస్తవం : మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు, మీదగ్గర పెద్ద మొత్తంలో పెట్టుబడులకు సొమ్ములు లేనప్పుడు SIP పెట్టుబడి మంచి నిర్ణయం అవుతుంది. మార్కెట్ పెరుగుతున్నప్పుడు లేదా దీర్ఘకాలిక పెట్టుబడి కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం మంచిది.

ఎక్కువ ఛార్జీలు
అపోహ : ఎక్కువ చార్జీలు ఉంటాయట
వాస్తవం :మ్యూచువల్ ఫండ్ సంస్థల ద్వారా నేరుగా పెట్టుబడి పెడితే పెట్టుబడి చార్జీలు వర్తించవు. బ్రోకరేజ్, ఏజెంట్ల ద్వారా పెట్టుబడి పెడితే వారిచ్చే సర్వీసులకు గాను కొంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తుంటారు.

లాకిన్ పీరియడ్
అపోహ : లాకిన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సులభం కాదట
వాస్తవం : కేవలం టాక్స్ సేవింగ్ (ఈఎల్ఎస్ఎస్ ) మ్యూచువల్ ఫండ్స్, క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ కు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఇతర మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ మెంట్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉండదు. కొన్ని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ల రకం, వాటి కాలపరిమితి ని బట్టి ఎగ్జిట్ లోడ్ చార్జీలను విధిస్తుంటారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications