మారుతీ సుజుకీ సెడాన్ డిజైర్ వచ్చి పదేళ్లు దాటింది. ఇది ఇప్పటికే ఆ సెగ్మెంట్ నెంబర్ వన్‌గా ఉంది. మారుతీ సుజుకీ కంపాక్ట్ సెడాన్ కారును ఇప్పటి వరకు 19 లక్షల మంది కొనుగోలు చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ 2.5 లక్షల డిజైర్ (Dzire) కార్లను విక్రయించింది. అంటే నెలకు సగటున 21,000 కార్లను అమ్ముడుపోయాయి. మారుతీ సుజుకీ డేటా ప్రకారం కంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో Dzire మార్కెట్ షేర్ 55 శాతం. ప్రతి రెండు నిమిషాలకు ఓ కారు అమ్ముడు పోతోంది.
మారుతీ సుజుకీ జర్నీలో Dzire కారు పాత్ర కీలకమైనదని మారుతీ సుజుకీ లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెల్లడించారు. కస్టమర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. Dzire లాంచ్‌తోనే తాము కంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ తీసుకు వచ్చామన్నారు. వినియోగదారులు ఈ కారుతో సంతృప్తిగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. థర్డ్ జనరేషన్ Dzire అమ్మకాలు 20 శాతం పెరిగాయని చెప్పారు.

తాము కస్టమర్ల డిమాండుకు అనుకూలమైన ఫీచర్లతో కార్లను తీసుకు వస్తున్నామని చెప్పారు. ఆరు రకాల Dzire కార్లలో ఆటో గేర్ షిఫ్ట్ (AGS) టెక్నాలజీ అందుబాటులో ఉందన్నారు. దాదాపు 13 శాతం మంది కస్టమర్లు ఆటోమేటిక్ వేరియంట్ Dzire కార్లను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దాదాపు సగం Dzire కారు కస్టమర్లు తమ కంపాక్ట్ సెడాన్ కారును కొనుగోలు చేస్తున్నారన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications