స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా లాభాల బాటలో పయనించింది. టెక్నాలజీ షేర్లలో మద్దతు నిఫ్టీ మళ్లీ 12 వేల పాయింట్ల దిశగా అడుగులు వేసింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు నిఫ్టీకి అండగా నిలిచాయి. ప్రధానంగా ఆసియా, యూరోప్ నుంచి కూడా పాజిటివ్ సపోర్ట్ లభించడం కలిసొచ్చింది. గత వారంలో వచ్చిన నిరుత్సాహంతో ఇన్వెస్టర్లు డీలా పడ్డారు.
అయితే వారం ప్రారంభంలోనే నిఫ్టీ లాభపడింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. లాభపడిన స్టాక్స్ కంటే నష్టపోయిన స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎన్ఎస్ఈలో అడ్వాన్స్ - డిక్లైన్స్ చూస్తే ఇది అర్థమవుతుంది. చివరకు నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 11923 దగ్గర, సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 39784 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయి 31034 దగ్గర స్థిరపడింది.

బిపిసిఎల్, యెస్ బ్యాంక్, కోల్ ఇండియా, గెయిల్, టాటా మోటార్స్ షేర్లు టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. బ్రిటానియా, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ గెయినర్స్ జాబితాలో చేరాయి.
సెక్టోరల్ ఇండెక్సుల పరంగా చూస్తే ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా రంగ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. ఎఫ్ఎంసిజి, ఐటి, ఫార్మా రంగ షేర్లు మాత్రమే కాస్త ఫరవాలేదనిపించాయి.
డిహెచ్ఎఫ్ఎల్ రికవరీ
ఎన్‌సిడీలకు చెల్లించాల్సిన సొమ్ములో భాగంగా అసలు,వడ్డీతో కలిపి సుమారు రూ.276.05 కోట్లను డిహెచ్ఎఫ్ఎల్ చెల్లించిన నేపధ్యంలో ఈ స్టాక్ ఎగిరి గంతేసింది. ఏకంగా 8-9 శాతం పెరిగింది. చివరకు 7.19 శాతం లాభంతో రూ.89.50 దగ్గర క్లోజైంది.
ఎల్ అండ్ టికి ఆర్డర్ బూస్ట్
వివిధ వ్యాపారాల్లో సుమారు రూ.2000-2500 కోట్ల ఆర్డర్లు అందుకున్న నేపధ్యంలో ఎల్ అండ్ టి స్టాక్‌కు జోష్ నిచ్చింది. దీంతో ఈ స్టాక్ సుమారు రెండు శాతం వరకూ లాభపడింది. చివరకు రూ.1532.20 దగ్గర క్లోజైంది.
అ'నిల్' అంబానీ
గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకే క్వార్టర్లో భారీ నష్టాన్ని ప్రకటించిన రిలయన్స్ పవర్‌ను కుప్పకూల్చారు ఇన్వెస్టర్లు. తమదగ్గరున్న షేర్లను తెగనమ్ముకోవడంతో స్టాక్ భారీగా పతనమైంది. ఆదాయం 35 శాతం క్షీణించి రూ.1586 కోట్లకు పరిమితమైంది. ఇక గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.189 కోట్ల లాభం ప్రకటించిన సంస్థ ఇప్పుడు ఏకంగా రూ.3558.50 కోట్ల నష్టాన్ని చూపించింది.
ఆస్తుల కంటే అప్పులు ఎక్కువగా ఉన్న విషయాన్ని ఆడిటర్ తన నివేదికలో సూచించారు. రూ.4170 కోట్ల ఊహించని నష్టం(ఆస్తుల విలువ మదింపు, ఇచ్చిన అడ్వాన్సులు, రావాల్సిన బకాయిలు రాబోవని నిర్ధారించుకుని కొట్టివేయడం) వల్లే ఈ సారి నష్టానికి కారణమని యాజమాన్యం వెల్లడించింది. అయినప్పటికీ మార్కెట్లో స్టాక్ 20 శాతం వరకూ కోల్పోయింది. ఒక దశలో రూ.4.85కి పడిపోయిన స్టాక్ చివరకు రూ.5.75 దగ్గర ముగిసింది.
ఇదే గ్రూపునకు చెందిన మరో కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రా పరిస్థితి కూడా అలానే ఉంది. వరుసగా ఐదో సెషన్‌లో కూడా ఈ స్టాక్ పతనమైంది. ఫలితాల ప్రకటన విషయంలో బోర్డ్ మళ్లీ సమయాన్ని తీసుకోవడం ఇన్వెస్టర్లను టెన్షన్ పెట్టింది. దీంతో ఈ స్టాక్ కూడా 13 శాతానికిపైగా కోల్పోయి రూ.64.20 దగ్గర క్లోజైంది.
అనిల్ అంబానీకి చెందిన మరో కంపెనీ యాడ్‌ల్యాబ్స్ ఎంటర్‌టైన్మెంట్ 18 శాతం, రిలనయ్స్ హోం ఫైనాన్స్ 13 శాతం, రిలయన్స్ డిఫెన్స్ స్టాక్స్ 10 శాతం నష్టపోయాయి.
జైన్ ఇరిగేషన్‌కు కార్పొరేట్ ఎఫెక్ట్
జైన్ ఇరిగేషన్‌కు ఉన్న పైపుల బిజినెస్‌ను అమ్మడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తోందంటూ వచ్చిన వార్తలు స్టాక్‌ను పడేశాయి. ఈ స్టాక్ ఏకంగా 14 శాతం పతనమైంది. చివరకు రూ.37.35 దగ్గర క్లోజైంది. ఇలా వివిధ కారణాలతో జెకె బ్యాంక్ 12 శాతం, సుజ్లాన్ ఎనర్జీ 11 శాతం, పిజి జ్యువెలర్స్ 10 శాతం, దీపక్ నైట్రైట్ 9 శాతం, అడ్వాన్స్ ఎంజైమ్స్ 7 శాతం నష్టపోయాయి.
క్రూడ్ ఎఫెక్ట్
గత కొంత కాలం నుంచి కూల్‌గా ఉన్న క్రూడాయిల్‌లో యాక్టివిటీ పెరిగింది. ధరలు పెరగడంతో మన దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల స్టాక్స్‌పై ఎఫెక్ట్ పడింది. బిపిసిఎల్, హెచ్ పి సి ఎల్, ఐఓసిఎల్ స్టాక్స్ 2-3 శాతం వరకూ నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Layoffs: ఒరాకిల్ లేఆఫ్స్: ఒక్క రోజే 30 వేల మంది ఇంటికి! అసలు కారణం ఇదే!

డెలాయిట్ 50 వేల ఉద్యోగాల ప్రకటన.. 30 వేల మందికి ఏఐపై ప్రత్యేక శిక్షణ..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications