ఉత్పత్తి ప్లాంట్లను మూసివేయనున్న మారుతీ సుజుకీ..కారణం ఇదేనా..?
ఢిల్లీ: భారత్‌లో ప్రయాణికుల వాహనాల ఉత్పత్తికి బ్రేక్ పడనుందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.ప్రస్తుత త్రైమాసికంలో చాలా వరకు తయారీ సంస్థలు మూతపడనున్నట్లు సమాచారం. దీంతో మార్కెట్లు బలహీనపడటమే కాక, ఆటోమొబైల్ ఇండస్ట్రీ తన లక్ష్యాలను అందుకోవడంలో కూడా కష్టతరంగా మారింది. ఇక ఇప్పటికే దాదాపు 35వేల కోట్ల రూపాయలు విలువ చేసే వాహనాలు అమ్ముడుపోలేదు. ఇవన్నీ డీలర్ల వద్దే ఉన్నాయి. 18వేల కోట్ల రూపాయలు విలువ చేసే ద్విచక్రవాహనాలు కూడా అమ్ముడుపోకుండా గోడౌన్లకే పరిమితం అయ్యాయి.
ఇక టాప్ టెన్ వాహన తయారీ సంస్థల్లో ఏడు సంస్థలు మే జూన్ మధ్య తమ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు ఉన్నాయి. ఇప్పటికే మూసివేసే ప్రక్రియను కొన్ని కంపెనీలు పూర్తి చేశాయి. మిగతా కంపెనీలు రానున్న రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తాయని సమాచారం. వాహనాలు అమ్ముడుపోనప్పుడు వాటిని తయారు చేసి గోడౌన్లలో ఉంచుకోవడం వల్ల లాభమేంటని ప్రశ్నించారు టాటామోటార్స్ వాహనాల తయారీ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న మయాంక్ పరీక్. ఇక తమకున్న లెక్కల ప్రకారం మేలో కానీ జూన్‌లో కాని ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మే-జూన్ నెలలో వాహన ఉత్పత్తి సంస్థలను మూసివేస్తే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 20 నుంచి 25శాతం ఔట్‌పుట్ తగ్గుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఉన్న సరుకు అమ్ముడుపోతుందని తెలిపారు. ఇక ఎక్కువగా నష్టపోతున్నది డీలర్లే అని విశ్లేషకులు చెబుతున్నారు. అమ్ముడుపోని వాహనాలపై కూడా తాము జీఎస్టీ కట్టాల్సి వస్తోందని డీలర్లు ఆవేదన చెందుతున్నారు. ఇక మే నెలలో మారుతీ, మహీంద్ర, టాటా మోటార్స్ లాంటి సంస్థలు ఉత్పత్తిని నిలిపివేశాయి.
వీటితో పాటు హోండా కార్స్ ఇండియా, రీనాల్ట్ నిస్సాన్ అలయన్స్, స్కోడా ఆటోలు కూడా తమ ప్లాంట్లను 4 నుంచి 10 రోజులు మూసివేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే మారుతీ సుజుకీ తమ ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇక మహీంద్ర సంస్థ కూడా 5 రోజుల నుంచి 13 రోజులను నో ప్రొడక్షన్ డేగా పరిగణిస్తున్నట్లు స్టాక్ మార్కెట్ ఎక్స్‌ఛేంజ్‌లకు తెలిపింది. ఇదిలా ఉంటే వాహనాల సేల్స్ క్రమంగా పడిపోతున్నాయని. దీనికి కారణం పెరుగుతున్న ఇంధన ధరలు ఒకటైతే రెండోది ఉపాధి కల్పన మందగించడమే అని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications