రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా ఈ కేలండర్ ఇయర్‌లో మూడోసారి కీలక రెపో రేటును తగ్గించింది. మూడుసార్లు 25 బేసిక్ పాయింట్ల చొప్పున తగ్గించడంతో ప్రస్తుతం రెపో రేటు 5.75 శాతంగా ఉంది. దీంతో కస్టమర్లకు హోమ్ లోన్, వెహికిల్ లోన్స్‌తో పాటు ఇతర లోన్ భారం తగ్గే అవకాశముంది. బ్యాంకులు ఈ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది. ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసేదే రెపో రేటు.

రెండు రకాల హోమ్ లోన్స్
సాధారణంగా హోమ్ లోన్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఫ్లోటింగ్, ఫిక్స్డ్ లోన్స్ ఉంటాయి. బ్యాంకులు ప్రస్తుతం ఎక్కువగా ఫ్లోటింగ్ ఇంటరెస్ట్ రేటు (వడ్డీ రేటు)ను ఆఫర్ చేస్తున్నాయి. ఇది MCLRతో లింక్ అయి ఉంటుంది. ఉదాహరణకు ఓ బ్యాంకు ఎంసీఎల్ఆర్ 8.50 శాతంగా ఉందనుకుందాం. 0.25 శాతం ఇప్పుడు తగ్గడంతో.. మొత్తంగా హోమ్ లోన్ వడ్డీ రేటు 8.75గా (MCLR+Spread) ఉంటుంది. మీరు బ్యాంకుల నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నట్లే, బ్యాంకులు కూడా ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకుంటాయి. అయితే ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు ఇవ్వాలని లేదు. అలాగే, ఫండ్స్ అవలబులిటీపై కూడా ఇది ఆధారపడి ఉంది.

మోడీ ప్రభుత్వం, వడ్డీ రేటు-జీఎస్టీ తగ్గుదల
ఆర్బీఐ నిర్ణయం ద్వారా కస్టమర్లకు లబ్ధి చేకూరనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం (మోడీ ప్రభుత్వం), హోమ్ లోన్స్ ఈఎంఐలు తగ్గడంతో పాటు జీఎస్టీ రేట్లు తగ్గడం వంటి కారణాలతో రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోళ్లు పెరుగుతాయని చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాలు హోమ్ బయ్యర్స్‌కు ఎంతో లబ్ధి అంటున్నారు. ఇంటిని కొనుగోలు చేసేవారికి ఇది తీపికబురు అంటున్నారు. వడ్డీ రేట్లు తగ్గిన కారణంగా కొనుగోళ్లు పెరుగుతాయని చెబుతున్నారు. అయితే బ్యాంకులు ఈ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలని చెబుతున్నారు.

ఎస్బీఐ వడ్డీ రేట్లు
వేతనజీవులు, నాన్-శాలరైడ్ పురుషులు, మహిళలకు వేర్వేరు వడ్డీలకు హోమ్ లోన్స్ ఇస్తుంది. ఉదాహరణకు రూ.30 లక్షల వరకు హోమ్ లోన్ తీసుకుంటే ఎస్బీఐ వడ్డీ రేటు శాలరైడ్ మహిళలకు 8.55% నుండి 8.65% మధ్య ఉంటుంది. నాన్-శాలరైడ్ మహిళలకు 8.70% నుండి 8.80%గా ఉంటుంది. రూ.30 లక్షలకు పైన హోమ్‌లోన్ తీసుకునే శాలరైడ్ మహిళలకు 8.80% నుండి 8.90%గా ఉంటుంది. నాన్ శాలరైడ్ మహిళలకు 8.95% నుండి 9.05%గా ఉంటుంది. రూ.75 లక్షలకు పైన లోన్ తీసుకుంటే శాలరైడ్ మహిళళకు 8.90% నుండి 9%, నాన్-శాలరైడ్ మహిళలకు 9.05% నుండి 9.15%గా ఉంటుంది. పురుషులకు 5 బేసిక్ పాయింట్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఉదాహరణకు రూ.30 లక్షల వరకు లోన్ పైన పురుషులకు 8.60% నుండి 8.70% గా ఉంటుంది. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.45 శాతంగా ఉంది.

హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లు
హెచ్‌డీఎఫ్‌సీలో రూ.30 లక్షల లోన్ వరకు శాలరైడ్ మహిళలకు 8.60 నుండి 9.10%గా ఉంది. నాన్-శాలరైడ్ మహిళలకు 8.75 నుండి 9.25%గా ఉంది. రూ.30 లక్షలకు పైన శాలరైడ్ మహిళలకు 8.85 నుండి 9.35%గా, నాన్ శాలరైడ్ మహిళలకు 9.00 నుండి 9.50%గా ఉంది. రూ.75 లక్షల కంటే పైన లోన్ తీసుకుంటే శాలరైడ్ మహిళలకు 8.90 నుండి 9.40%గా, నాన్ శాలరైడ్ మహిళలకు 9.05 నుండి 9.55%గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీలోను పురుషులకు.. మహిళల కంటే 5 బేసిక్ పాయింట్స్ ఎక్కువగా ఉంటుంది. 1 ఇయర్ ఎంసీఎల్ఆర్ 8.70గా ఉంది.

ఐసీఐసీఐ వడ్డీ రేట్లు
ఐసీఐసీఐ బ్యాంకులో హోమ్ లోన్స్ శాలరైడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా ఉంటాయి. రూ.35 లక్షల లోపు హోమ్ లోన్ తీసుకుంటే 9.05%, రూ.35 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు తీసుకుంటే 9.15%, రూ.75 లక్షలకు పైన తీసుకుంటే 9.20%గా ఉంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ హోమ్ లోన్ వడ్డీ రేటు 9.10% నుండి 9.25%గా ఉంది. 1 ఇయర్ ఎంసీఎల్ఆర్ రేటు 8.75గా ఉంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications