దేశీయ విమానయాన కంపెనీలైన ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ లకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2019-20)లో రికార్డ్ స్థాయిలో లాభాలు వస్తాయని ఎయిర్ లైన్ కన్సల్టెన్సీ కంపెనీ 'సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ( కాపా) అంచనా వేస్తోంది. దేశీయంగా అధిక మార్కెట్ వాటా కలిగిన ఇండిగో ఒక్కటే 40-50 కోట్ల డాలర్ల లాభాన్ని నమోదు చేసుకునే దిశగా వెళుతున్నట్టు కాపా చెబుతోంది. అంతే కాకుండా ఈ మూడు కంపెనీల మొత్తం విమానాల సంఖ్య ఈ ఏడాదిలో 500 దాటుతుందని అంటోంది. ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ గత ఏప్రిల్ లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినందువల్ల దేశీయ ఎయిర్ లైన్స్ సామర్థ్యం తగ్గిపోయింది.
అయితే 2019-20 ద్వితీయార్థంలో దేశీయంగా సామర్థ్యాలు పుంజుకుంటాయని కాపా చెబుతోంది. జెట్ సర్వీసులు నిలిపివేసిన కారణంగా టికెట్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఫలితంగా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య ఈ ఏడాదిలో గత ఏడాదితో పోల్చితే ఐదు శాతం కన్నా తక్కువగా ఉంటుందని కాపా అంచనా వేస్తోంది. జెట్ ఎయిర్ వేస్ సర్వీసుల నిలిపివేసిన ప్రభావం అంతర్జాతీయ సర్వీసులపై ఎక్కువగానే ఉన్నట్టు చెబుతోంది. అంతర్జాతీయ సెక్టార్ లో రికవరీకి 1-2 సంవత్సరాలు పడుతుందని అంచనా.
- గత ఆర్థిక సంవత్సరం మార్చి నెలతో నాలుగో త్రైమాసికంలో ఇండిగోను నడిపిస్తున్న ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ నికర లాభం ఐదింతలు పెరిగి రూ. 589. 59 కోట్లకు చేరుకుంది.
- జెట్ ఎయిర్ వేస్ సర్వీసులను నిలిపివేయడం ఈ కంపెనీకి బాగా కలిసి వచ్చింది. దేశీయ మార్కెట్లో ఇండిగోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది.
- మార్చి త్రైమాసికంలో ఈ కంపెనీ 1.57 కోట్లమంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చింది.
- మర్చి చివరినాటికి ఈ కంపెనీ అప్పు రూ. 2,429 కోట్లుగా ఉంది.
- ప్రస్తుతం ఈ కంపెనీ వద్ద 217 విమానాలు ఉన్నాయి.

స్పైస్ జెట్ నెంబర్ 2
నిధులులేక ఏప్రిల్ 17న జెట్ ఎయిర్ వేస్ తన సర్వీసులను నిలిపివేసింది. దీనితో ఈ కంపెనీకి విమానాలు ఇచ్చిన లెస్సర్లు తమ విమానాలను వెనక్కి తీసుకుంటున్నారు. జెట్ ఎయిర్ వేస్ కు చెందిన డొమెస్టిక్ స్లాట్లు, ఇంటర్నేషనల్ రైట్స్ ను తాత్కాలికంగా ఇతర ఎయిర్ లైన్స్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. ఇక జెట్ ఎయిర్ వేస్ కు విమానాలను లీజుకు ఇచ్చిన వారు వాటిని వెనక్కి తీసుకుని స్పైస్ జెట్ కు ఇస్తున్నారు. దీనివల్ల స్పైస్ జెట్ మరింత బలోపేతం అవుతోంది. అంతేకాకుండా మార్కెట్లో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరిస్తోంది. 12 నెలల కాలంలోనే ఈ కంపెనీ మార్కెట్ వాటా 25 శాతానికి చేరుకోవచ్చని అంచనా. ఇక జెట్ ఎయిర్ వేస్ సర్వీసుల నిలిపివేత ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చాలా ఆఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ విదేశీ మార్కెట్లపై ఎక్కువ దృష్టి పెట్టె అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ఈ కంపెనీలు 40 నారో బాడీ విమానాలను 2019-20 సంవత్సరంలో అంతర్జాతీయ రూట్లలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
సిద్దమవుతున్న విస్తారా
టాటాలు, సింగపూర్ ఎయిర్ లైన్స్ భాగస్వామ్యంలో ఏర్పాటైన విమానయాన సంస్థ విస్తారా ఈ ఏడాది ద్వితీయార్థంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి 22 విమానాలు ఉండగా వారానికి 850 విమాన సర్వీసులు నడుపుతోంది. ఈ కంపనీ ఆరు బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ విమానాలను కొనుగోలు చేసింది. ఇవి 2020, 2021 సంవత్సరం కంపెనీ చేతిలోకి రానున్నాయి. విస్తారా అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభిస్తే ఎయిర్ లైన్స్ కంపెనీల మధ్య పోటీ మరింత పెరగనుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications