అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పీఎం - కిసాన్ యోజన, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు జగన్ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తానని ప్రకటించారు. వైయస్సార్ రైతు భరోసా పేరుతో దీనిని రైతులకు అందించనున్నారు.

ఏడాదికి రూ.12,500
వైయస్సార్ రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.12,500 చొప్పున అందించనున్నారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం (ప్రస్తుత లెక్క ప్రకారం) రైతులకు రూ.13,125 కోట్లు కేటాయించాల్సి ఉంది. ఇందులో కౌలు రైతులకు రూ.2,500 కోట్లు అందించనున్నారు. ఇవి నేరుగా రైతుల అకౌంట్లలో పడతాయి. రైతు భరోసాను తాము అమలు చేస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. దీనిని రబీ సీజన్ నుంచే రైతులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు.

రూ.7 లక్షల ఆర్థిక సాయం
రైతులు ప్రమాదవశాత్తు మృతి చెందినా, ఆత్మహత్య చేసుకున్నా ఈ పథకం కింద వారికి రూ.7 లక్షల సాయం అందనుంది. పంటలకు మద్దతు ధర అందించేందుకు రూ.3వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. విపత్తులను ఎదుర్కొనేందుకు రూ.4వేల కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో కేంద్రం ఇచ్చే రూ.2వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2వేల కోట్లు ఏర్పాటు చేయనుంది. వచ్చే బడ్జెట్‌లో దీనిని కేటాయిస్తారు. పంటల బీమాలో రైతు వాటాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రైతులు ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తుందన్నారు. అలాగే, పంట నష్టపోతే బీమా సమస్యల పరిష్కారం వంద శాతంగా ఉండాలని సూచించారు.

అక్కడి నుంచే రైతులకు అన్నీ
ఇక సహకార డెయిరీలకు పాలు విక్రయించే రైతులకు లీటరుకు రూ.4 బోనస్ చొప్పున చెల్లించాలని జగన్ నిర్ణయించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలను వ్యవసాయ రంగ అవసరాలకు ప్రధానకేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందుల పంపిణీ ఇక్కడి నుంచే జరగనుంది. కైలు రైతులకు ప్రభుత్వం పథకాలు సక్రమంగా అందేందుకు గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు అవసరమైతే విత్తన చట్టం తేనున్నారు. విత్తనాల్లో అక్రమాలు జరిగితే జైలుకు పంపేందుకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు.

అగ్రికల్చర్ మిషన్
రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం పైనే ఆధారపడుతున్నారని, అలాంటి రైతులకు ప్రయోజనాలు అందాలని జగన్ అధికారులను ఆదేశించారు. రైతు సంతృప్తి చెందకపోతే ఎంత చేసినా వృధా అన్నారు. రైతులకు మద్దతు ధర, పథకాల ప్రయోజనాలు పూర్తిగా అందించడం, పంటవేసే ముందే ప్రభుత్వ మద్దతు ధర నిర్ణయించడం, ఇతర వ్యవసాయ రంగ సిఫారసుల కోసం అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో వ్యవసాయ నిపుణులు, అధికారులను నియమించనున్నారు.

చంద్రబాబుకు షాక్.. పథకం రద్దు
చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. అయిదేళ్ల పాటు రైతుల కోసం ఏమీ చేయకుండా ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని తీసుకు వచ్చారని, ఈ పథకం ద్వారా అనర్హులకు సొమ్ము జమ అయిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రూ.2,800 కోట్లు చెల్లించినట్లు అధికారులు సీఎం జగన్‌కు చెప్పగా, ఈ పథకాన్ని రద్దు చేయాలని చెప్పారు.

దాదాపు 5లక్షల మందికి నో మనీ!
జగన్ ప్రభుత్వం.. చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన అన్నదాత సుఖీభవను రద్దు చేశారు. టీడీపీ ప్రభుత్వం గత మార్చిలో ఈ పథకం ప్రారంభించింది. 50,20,972 రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించాయి. 46,49,369 కోట్ల మందికి డబ్బులు జమ అయ్యాయి. మరికొంతమందికి జమ చేయాల్సి ఉంది. అకౌంట్ నెంబర్లు, ఆధార్, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో మూడున్నర లక్షల మందికి పైగా ఈ ప్రయోజనం పొందలేకపోయారు. మొదటి దశలో రూ.1,000, రెండో దశలో రూ.3వేల చొప్పున జమ చేశారు. అయితే రెండో దశ కూడా మరో లక్షమందికి పైగా రైతు కుటుంబాలకు జమ కాలేదు. మొదటి దశలో మూడున్నర లక్షల మందికి, రెండో దశలో వీరితో పాటు మరో లక్షకు పైగా రైతు కుటుంబాలకు జమ కాలేదు. ఇప్పుడు ఈ పథకం రద్దు కావడంతో ఆయా రైతు కుటుంబాల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం లేదు.

కీలక నిర్ణయాలు
అక్టోబర్ 15వ తేదీ నుంచి రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందించడం. పంటల బీమా ప్రీమియం చెల్లింపు, వడ్డీలేని రుణాలు ఇచ్చే ఏర్పాటు. కౌలు రైతులకు సాయం, ప్రత్యేక గుర్తింపు కార్డు. రూ.3వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి. విపత్తులు ఎదుర్కొనేందుకు రూ.4వేల కోట్ల నిధి. రేషన్ బియ్యంతో పాటు మరో 6 రకాల వస్తువులు. వ్యవసాయ కమిషన్ ఏర్పాటు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications