చైనా మొబైల్ దిగ్గజం హువావేకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఆంక్షల నేపథ్యంలో హువావేను టెక్ సంస్థలు దూరం పెడుతున్నాయి. ఇప్పటికే గూగుల్ సహా పలు కంపెనీలు హువావేకు తమ సేవలు ఉండవని చెప్పాయి. గూగుల్ తీసుకున్న నిర్ణయం ప్రకారం 90 రోజుల తర్వాత హువావే కొత్త ఫోన్లకు గూగుల్ సేవలు ఉండవు. ఇప్పుడు సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాంలు కూడా అదే బాట పట్టాయి.
ఫేస్‌బుక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హువావే కొత్త ఫోన్లలో ఫేస్‌బుక్, వాట్సాప్ ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లు ఇక ఉండవు. అవి కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇప్పటికే హువావే ఫోన్లు వినియోగిస్తున్న వారికి మాత్రం ఇబ్బంది ఉండదు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు సంబంధించిన అన్ని అప్ డేట్స్ పాతవారికి లభిస్తాయి.

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం వంటి సోషల్ మీడియా యాప్స్ తమ కొత్త మొబైల్స్‌లో ప్రీ-ఇన్‌స్టాల్ యాప్స్ కోసం ముందే ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఇది ఇద్దరికీ ప్రయోజనకారిగా ఉంటుంది. హువావేలో కూడా ఫేస్‌బుక్ వంటివి ప్రీ-ఇన్‌స్టాల్‌గా ఉంటాయి. కానీ ఫేస్‌బుక్ ఇప్పుడు షాకిచ్చింది. దీనిపై హువావే స్పందించాల్సి ఉంది.
ప్రస్తుతం హువావే ఫోన్స్ కొనేవారికి ఫేస్‌బుక్ ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌గా లభించదు. అయితే, గూగుల్ ప్లే స్టోర్ నుంచి వారు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ, గూగుల్ నిర్ణయం ప్రకారం 90 రోజుల తర్వాత ప్లేస్టోర్ యాక్సెస్‌ను కూడా హువావే కొత్త ఫోన్లకు ఇవ్వదు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications