For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెపోరేటు: మీ హోమ్ లోన్, కారు లోన్ EMI భారం ఎంత తగ్గుతుందో తెలుసా?

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం రెపో రేటును పావు శాతం తగ్గించింది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో మూడోసారి తగ్గించారు. ప్రతిసారి పావు శాతం (25 బేసిక్ పాయింట్లు) చొప్పున తగ్గించడంతో ఈ ఏడాది ప్రారంభంలో 6.5 శాతంగా ఉన్న రెపో రేటు తాజా నిర్ణయంతో 5.75 శాతానికి చేరింది. రెపో రేటు తగ్గిన నేపథ్యంలో గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది. రెపో రేటు ప్రయోజనాలను బ్యాంకులు కస్టమర్లకు బదలీ చేస్తే ఈఎంఐలు తగ్గనున్నాయి.

త్వరలో ATM ఛార్జీలు తగ్గే ఛాన్స్, కమిటీ వేయనున్న RBIత్వరలో ATM ఛార్జీలు తగ్గే ఛాన్స్, కమిటీ వేయనున్న RBI

రూ.30 లక్షల హోమ్‌లోన్‌పై ఎంత తగ్గుతుందంటే?

రూ.30 లక్షల హోమ్‌లోన్‌పై ఎంత తగ్గుతుందంటే?

ఉదాహరణకు ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ నుంచి వేతనజీవులు రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే ఇలా ఉండే అవకాశముంది. రూ.30 లక్షల హోమ్‌లోన్ పైన 20 ఏళ్ల టెన్యూర్‌కు ఇప్పటి వరకు 8.6 శాతం వడ్డీ రేటు ఉంది. EMI 26,225 ఉంటుంది. ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో వడ్డీ రేటు 8.35కు తగ్గి, EMI 25,751 కానుంది. ఆర్బీఐ రెపో రేటు తగ్గుదలను ఎస్బీఐ తమ కస్టమర్లకు బదలీ చేస్తే వారిపై రూ.474 EMI భారం తగ్గనుంది.

రూ.25 లక్షలు పదేళ్ల కాలపరిమితి అయితే..?

రూ.25 లక్షలు పదేళ్ల కాలపరిమితి అయితే..?

10 ఏళ్ల కాలపరిమితి (10 ఇయర్ టెన్యూర్)తో 25 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే.. ఇప్పటి వరకు EMI 31,332 గా ఉంది. ఇప్పుడు రెపో రేటు తగ్గడంతో ఇది దాదాపు 30,996గా ఉండవచ్చు. ఇది తక్కువగా కనిపించవచ్చు. కానీ మొత్తంగా అంటే మీ లోన్ డ్యూ డేట్ పూర్తయ్యేసరికి లెక్కిస్తే దాదాపు 40,000కు పైగా మీ అమౌంట్ తగ్గుతుంది. ఎంత ఎక్కువ హోమ్ లోన్ తీసుకుంటే అంత ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశముంది.

కారు లోన్ పైన...

కారు లోన్ పైన...

హోమ్ లోన్ పైనే కాదు.. వాహనాల లోన్ పైన కూడా వడ్డీ రేటు.. తద్వారా ఈఎంఐ రేటు తగ్గుతుంది. ఉదాహరణకు మీరు 7 ఏళ్ల కాలపరిమితితో రూ.10 లక్షల కారు లోన్ తీసుకుంటే... మీ EMI రూ.16,089 నుంచి రూ.15,962కి తగ్గుతుంది.

English summary

రెపోరేటు: మీ హోమ్ లోన్, కారు లోన్ EMI భారం ఎంత తగ్గుతుందో తెలుసా? | RBI cuts repo rate by 25 bps: Here's how much your EMI may fall

The EMI on a Rs 10 lakh car loan for 7 years will come down from Rs 16,089 to Rs 15,962 if the interest rate comes down from 9 per cent to 8.75 per cent.
Story first published: Thursday, June 6, 2019, 16:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X