JioPhone 2 ఫ్లాష్‌సేల్: టైమింగ్స్, ధర, ఇతర వివరాలు ఇవే
రిలయన్స్ జియో 4G ఫోన్.. జియోఫోన్ 2 (JioPhone 2) ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఈ ఫోన్ ఫ్లాష్ సేల్ గురువారం (జూన్ 6) మధ్యాహ్నం గం.12.00 కు ప్రారంభమవుతుంది. ఫ్లాష్ సేల్ నేపథ్యంలో ఈ ఫోన్‌ను జియో కేవలం రూ.2,999లకే అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న జియో ఫోన్ ఫీచర్స్‌తో పాటు అప్‌గ్రేడ్ చేయబడిందే జియో ఫోన్ 2. ఇందుకు ప్రత్యేక ప్రీపేయిడ్ రీచార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. రూ.49, రూ.99, రూ.153, రూ.297, రూ.594 ఉన్నాయి.
JioPhone 2ను ఎలా బుక్ చేయాలి?
- రిలయన్స్ వెబ్ సైట్ యొక్క jio.com కు లాగిన్ కావాలి.
- జియో ఫోన్ 2 సెలక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత పిన్‌కోడ్ ఎంటర్ చేసి, ప్రొసీడ్ కావాలి.
- ఆ తర్వాత కొనుగోలు చేసేవారు పర్సనల్ డిటైల్స్ ఇవ్వాలి. అంటే పేరు, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఇవ్వాలి.
- ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
- రూ.2,999 చెల్లించిన తర్వాత, ఆర్డర్ కన్‌ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మేషన్‌కు సంబంధించిన సమాచారం ఈ-మెయిల్, ఎస్సెమ్మెస్ ద్వారా మీకు వస్తుంది.

ఇక్కడ ఐదు రకాల రీచ్రాజ్ ప్లాన్స్ ఉన్నాయి.
- రూ.49 ప్లాన్‌తో 14GB హైస్పీడ్ డేటా. ప్రతి రోజు డేటా లిమిట్ 0.5GB. ఈ డేటా పూర్తయ్యాక 64kbpsకు తగ్గుతుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీ ఆఫర్. 300 ఎస్సెమ్మెస్‌లు చేసుకోవచ్చు. అపరిమిత కాల్స్
- రూ.153 ప్లాన్‌తో 42GB హైస్పీడ్ డేటా. రోజుకు డేటా లిమిట్. 1.5GB. ఈ డేటా అయ్యాక 64kbpsకు తగ్గుతుంది. ఈ ప్యాక్ 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు. అపరిమిత కాల్స్
- రూ.297 ప్లాన్‌తో రోజుకు 42GB హైస్పీడ్ డేటా. రోజుకు డేటా లిమిట్ 0.5GB. ఆ తర్వాత 64kbpsకు తగ్గుతుంది. 84 రోజుల వ్యాలిడిటీ. 300 ఎస్సెమ్మెస్. అపరిమిత కాల్స్
- రూ.594 ప్లాన్‌తో అపరిమిత కాల్స్. 300 ఎస్సెమ్మెస్‌లు. 84 GB హైస్పీడ్ డేటా. రోజుకు 0.5GB డేటా యూజ్ చేయవచ్చు. ఆ తర్వాత 64kbpsకు తగ్గుతుంది. ఇది 168 రోజుల వ్యాలిడిటీ కలిగన ఆఫర్.


Click it and Unblock the Notifications