లక్కీ నెంబర్ రాసి, రూ.2వేల కోట్ల లాటరీ గెలుచుకున్నాడు

సరదాగా తన మనవరాలితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. దీంతో అతనికి ఏకంగా 344.6 మిలియన్ డాలర్ల లాటరీ తగిలింది. అంటే భారత కరెన్సీలో రూ.2,300 కోట్లకు పైగా. ఈ జాక్ పాట్ తగిలింది అమెరికాకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి. ఫార్చూన్ కుకీ ద్వారా చార్లెస్ జాక్సన్ (66) ఏళ్ళ వ్యక్తికి ఈ లాటరీ తగిలింది.

చార్లెస్ జాక్సన్ ఓ రోజు తన మనవరాలితో కలిసి వియత్నాం రుచులను వడ్డించే రెస్టారెంటుకు వెళ్లాడు. ఇందులో భాగంగా అక్కడ ఉన్న ఫార్చూన్ కుకీస్ లోపల ఉన్న పేపరుపై తన లక్కీ నెంబరును రాసి ఇచ్చాడు. ఇదో పవర్ బాల్ గేమ్. ఈ గేమ్‌లో ఆరు నెంబర్లు మ్యాచ్ కావాలి. కస్టమర్లకు రెస్టారెంట్ ఈ అవకాశం కల్పించింది. గత వారం లక్కీ డ్రా తీశారు. ఇందులో చార్లెస్‌ను అదృష్ట లక్ష్మి వరించింది. శనివారం నాడు అతను ఈ మొత్తాన్ని గెలుచుకున్నాడు.

Fortune cookie helped US man win $344 million jackpot in lottery

దీనిపై లాటరీ గెలుచుకున్న చార్లెస్ జాక్సన్ మాట్లాడుతూ.. తాను గెలుస్తానని అస్సలు ఊహించలేదని, నేను ఎంతో లక్కీ అన్నాడు. తాను తన మనవరాలి కోసం ఫార్చూన్ కుకీస్ తీసుకున్నానని, అందులోని కాగితంపై తన లక్కీ నెంబరును రాసిచ్చానని, లక్కీ డ్రా సమయంలో తన టిక్కెట్ చూసుకోలేదని, ఆ తర్వాత తనకే లాటరీ వచ్చిందని తెలిసిందని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+