ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ 'ఫిచ్' ఐసీఐసీఐ బ్యాంక్ రేటింగ్‌కు కోత విధించింది. ఒక అంచె డౌన్‌గ్రేడ్ చేసింది. దీర్ఘకాలిక ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్ (IDR) BBB- నుంచి BB+కు మార్చింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో ఫిచ్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఇది మరో షాక్. BB+ స్పెక్యులేటివ్ గ్రేడ్. BBB విభాగంలో వచ్చే పాయింట్లు మంచి రుణ నాణ్యతగా (గుడ్ క్రెడిట్ క్వాలిటీ) భావిస్తారు. యాక్సిస్ బ్యాంక్ రేటింగ్‌లో కూడా కోత విధించింది. ఈ బ్యాంక్ రేటింగ్ కూడా BBB- నుంచి BB+కు మార్చింది.

బ్యాంకుల స్ట్రగ్లింగ్
మరోవైపు, ఇప్పటికే ఫిచ్ ఇండియాలో నిర్వహణ వాతావరణానికి కూడా BBB- నుంచి BB+ ర్యాంక్ ఇచ్చింది. గత మూడేళ్ల బ్యాంకింగ్ రంగ పనితీరు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ బ్యాంకుల పనితీరు సంతృప్తికరంగా లేదని, బ్యాంకింగ్ సెక్టార్ ఇప్పటికీ పూర్ అసెట్స్ క్వాలిటీ, బలహీన మూలధనంతో ఇబ్బందులు పడుతోందని పేర్కొంది.

మొండి బకాయిలు
భారత్‌ను ఆసియాలో బీబీబీ రేటింగ్‌లో ఉన్న ఇతర దేశాలతో పోల్చి చూశామని, తలసరి జీడీపీ వంటి కీలక అంశాలను పరిశీలించామని, సరళతర వాణిజ్య వాతారణానికి వచ్చిన ర్యాంకును బట్టి రేటింగ్ ఇచ్చామని ఫిచ్ తన ప్రకటనలో తెలిపింది. భారత్‌లో బ్యాంకింగ్ రంగంలో భారీగా మొండిబకాయిలు ఉన్నాయని కూడా పేర్కొంది.
భారత్‌లో తిరిగిరాని బాకీలు తొమ్మిది నెలల్లో 11.5 శాతం నుంచి 10.5 శాతానికి తగ్గనున్నట్లు ఫిచ్ వేసింది. 2018 మార్చి ఆర్థిక సంవత్సర ముగింపు నాటికి 11.5 శాతం ఉండగా ఇది తగ్గుతుందని అంచనా వేసింది. అయినప్పటికీ ఇది ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే అధికమని పేర్కొంది.

ఐసీఐసీఐ, యాక్సిస్‌పై ఫిచ్ రేటింగ్ ప్రభావం
ఫిచ్ రేటింగ్ ప్రభావం ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ పైన ఉంటుందని ఫారన్ బ్రోకరేజ్ సీఎల్ఎస్ఏ ఉంటుందని భావిస్తోంది. ఫిచ్ రేటింగ్ నేపథ్యంలో మంగళవారం యాక్సిస్ బ్యాంక్ షేర్లు మొదట బలహీనంగా ట్రేడ్ అయ్యాయి. ఆ తర్వాత 1.1 శాతం పెరిగి రూ.821.4 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు కూడా వీక్‌గానే ప్రారంభమయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు మంగళవారం 0.9 శాతం తగ్గి 418.95 వద్ద ముగిశాయి. గురువారం ఉదయం 417 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications