26 వారాల లీవ్.. ఉద్యోగులకు జొమాటో గుడ్‌న్యూస్: పురుషులకూ పేరెంటల్ లీవ్
ఫుడ్ డెలివరీ జొమాటో తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇది కొత్త పారెంటల్ లీవ్ పాలసీని తీసుకు వస్తోంది. ఉద్యోగులకు పిల్లలు జన్మిస్తే 26 నెలల సెలవును ప్రకటించింది. కేవలం తల్లికే కాదు.. తండ్రికి కూడా తమ బిడ్డతో గడిపేందుకు సెలవులు ఇస్తామని జొమాటో ప్రకటించడం గమనార్హం. 26 వారాల పేయిడ్ పేరెంటల్ లీవ్‌ను ఇస్తోంది. ఇలాంటి లీవ్ పాలసీ భారతదేశంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

తల్లితో పాటు తండ్రికీ.. వీరికీ పేయిడ్ లీవ్
ఈ సెలవులు అందరికీ వర్తింప చేయడం గమనార్హం. అంటే సరోగేటివ్, పిల్లలను పెంచుకునే తల్లిదండ్రులతో పాటు సేమ్ సెక్స్ పేరెంట్స్‌కు కూడా వర్తింప చేస్తోంది. ఈ మేరకు జొమాటో ఫౌండర్ దీపీందర్ గోయల్ మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ గోల్స్‌ను అర్థవంతంగా రీచ్ కావాలంటే సమతుల్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. తాము మహిళలు అందరికీ 26 వారాల పేరెంటల్ పేయిడ్ లీవ్స్ ఇస్తున్నామని చెప్పారు. తాము ప్రభుత్వ పాలసీలను పాటిస్తున్నామని చెప్పారు. ఇలాంటి ప్రయోజనాలను పురుషులకు కూడా వర్తింప చేస్తున్నామన్నారు.

పుట్టిన బిడ్డ కోసం 1,000 డాలర్లు
భారతీయ చట్టం ప్రకారం మహిళలకు 26 వారాల మెటర్నిటీ లీవ్ తప్పనిసరి. అయితే తండ్రికి కూడా అలాంటి పేయిడ్ లీవ్ ఇవ్వాలనే నిబంధనలు లేవు. అయితే భారతదేశంలో తండ్రులకు కూడా పేరెంటల్ లీవ్ ఇస్తున్న మొట్టమొదటి కంపెనీ జొమాటో. వారికి పేరెంటల్ లీవ్స్ ఇవ్వడమే కాదు. పుట్టిన చిన్నారి కోసం 1,000 డాలర్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. గత ఆరు నెలల కాలంలోని వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయి.

ఇటీవల డియాజియో
దాదాపు రెండు వారాల క్రితం ఆల్కాహాలిక్ బీవరేజ్ మేకర్ డియాజియో కొత్త ఫ్యామిలీ లీవ్ పాలసీని తమ ఉద్యోగుల కోసం తీసుకు వచ్చింది. 26 వారాల మెటర్నీటీ లీవ్, 4 వారాలా పేరెంటల్ లీవ్ ఇచ్చింది. ఇప్పుడు జొమాటో తమ ఉద్యోగులకు అంతకంటే బంపరాఫర్ ప్రకటించింది. అయితే జొమాటో ఆఫర్లు నమ్మలేకపోతున్నట్లుగానే ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications