హైదరాబాద్: సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరైన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హైకోర్టు, సుప్రీం కోర్టులో ఆయనకు చుక్కెదురు కావడంతో మంగళవారం సాయంత్రం ఎట్టకేలకు విచారణకు హాజరయ్యాడు. ఆయన ఉదయం రావాల్సి ఉన్నప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం నాలుగున్నర గంటలకు వచ్చారని తెలుస్తోంది. ఆయనను సీసీఎస్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు.

రాత్రి తొమ్మిదిన్నర వరకు విచారణ
మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు రవిప్రకాశ్‌ను ఏసీపీ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం విచారించింది. ఈ రోజు (బుధవారం, 5, మే)కూడా ఆన విచారణకు హాజరు కానున్నారు. రవిప్రకాశ్ విచారణకు సహకరించారని తెలుస్తోంది. రవిప్రకాశ్ సహకరిస్తున్నాడని, అలాగే, సినీ నటుడు శివాజీకి కూడా సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చామని, కోర్టు అనుమతితో చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వీరికి తొలుత రెండుసార్లు 160 సీఆర్పీసీ కింద, మరో రెండుసార్లు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు.

ఆధారాలపై ఆరా
పుదుచ్చేరి రిజిస్ట్రేషన్ కలిగిన కారులో (పీవై05సీ0055) రవిప్రకాశ్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. దాదాపు ఐదు గంటల పాటు అతనిని పోలీసులు విచారించారు. టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్‌లో వాటాలు కొనుగోలు చేసిన అలంద మీడియా రవిప్రకాశ్ పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటాల విషయంలో తప్పుడు పత్రాల సృష్టించిన ఆరోపణలు, నటుడు శివాజీ పాత్ర వంటి అంశాలపై పోలీసులు ప్రశ్నించారని తెలుస్తోంది. ఇదివరకు తమ విచారణలో సేకరించిన ఆధారాలపై వారు ఆరా తీశారు. గతంలో మూర్తి సహా పలువురిని విచారించారు. వాటి ఆధారంగా ప్రశ్నించారు.

రవిప్రకాశ్ కారుపై చలానా
రవిప్రకాశ్ పుదుచ్చేరి రిజిస్ట్రేషన్ కలిగిన కారులో వచ్చారు. ఈ కారు పైన పలు ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై గత నెల 4న అతివేగంతో ప్రయాణించినందుకు రూ.వెయ్యి జరిమానా విధించారు. అలాగే, అంతకుముందు రూ.2,500 జరిమానా చెల్లించారు.

రవిప్రకాశ్ కీలక వ్యాఖ్యలు
విచారణ అనంతరం రవిప్రకాశ్ మీడియాతో మాట్లాడాడు. తనపై దొంగ కేసులు పెట్టారని విమర్శించాడు. ఇది మాఫియా - మీడియా మధ్య యుద్ధమని అభివర్ణించాడు. జర్నలిజమే గెలుస్తుందన్నాడు. 'TV9 చానెల్‌ను ఇద్దరు ధనికులు అక్రమంగా కొనుగోలు చేశారు. నాపై దొంగ కేసులు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బోర్డ్ మీటింగ్ నిర్వహించి నన్ను అక్రమంగా TV9 నుంచి బయటికి పంపించారు. విలువలకు... అవినీతికి, మాఫియాకు... మీడియాకు మధ్య ధర్మపోరాటం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో జర్నలిజమే గెలుస్తుంది. సత్యం, వాస్తవం, సమాజహితం కోసం పోరాడుతాను. పోలీసుల విచారణకు సహకరించాను. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. మాఫియాకు, మీడియాకు జరుగుతున్న పోరాటంలో ధర్మం గెలుస్తుంది. నాకు మద్దతిస్తున్న వారికి థ్యాంక్స్' అని రవిప్రకాశ్ అన్నాడు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications