ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థలైన ఉబెర్, ఓలా లకు ఆదరణ తగ్గుతోందా? అవును అనే చెబున్నాయి గణాంకాలు. గత మూడేళ్ళుగా యమా స్పీడ్ గ దూసుకుపోయిన ఈ రెండు కంపెనీలు ఈ ఏడాది చతికిల పడ్డట్లు తెలుస్తోంది. నష్టాలను తగ్గించుకొనేందు ఈ కంపెనీలు డ్రైవర్ల కమిషన్లు తగ్గించడం, చార్జీలు పెంచడంతో వినియోగ దారులు ప్రత్యామ్నాయాలు వెతుకకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

గత ఆరు నెలల్లో ఇదీ పరిస్థితి
గత ఆరు నెలల్లో రోజువారీ రైడ్స్ కేవలం 4% మాత్రమే పెరిగి 35 లక్షల నుంచి 36.5 లక్షలకు చేరుకొన్నాయట. 2016 లో 90% వృద్ధి నమోదు కాగా, 2017 లో 57%, 2018 లో 20% వృద్ధి నమోదు అవ్వగా, ఇప్పుడు కేవలం 4% వృద్ధికి పరిమితం అవ్వడం పరిస్థితికి అడ్డం పడుతోందని ది ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.
బెంగళూరులో క్యాబ్ డ్రైవర్లు 25-30% తగ్గారట. మూడు నాలుగు ఏళ్ళ క్రితం నెలకు దాదాపు రూ 90,000 సంపాదించే అవకాశం ఉందంటూ ఉబెర్, ఓలా సంస్థలు ఊదర కొట్టడంతో ఈ రంగంలోకి కొత్తగా చాలా మంది డ్రైవర్లుగా రంగ ప్రవేశం చేసారు. కొంత కాలం అంత బాగున్నట్లు ఉన్నప్పటికీ పోటీ విపరీతంగా పెరిగి పోయింది.

క్యాబ్‌ల విక్రయం
దీంతో రెండు సంస్థలు ఆఫర్లు కూడా బాగానే ఇచ్చాయి. అప్పటి వరకు ఆటో వాళ్ళతో బేరం ఆడుకొని ప్రయాణించే ప్యాసింజర్లకు తక్కువ ధరలోనే ఏసీ కార్లలో తిరిగే అవకాశం లభించింది. కానీ, ఉబెర్, ఓలా కంపెనీలకు భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు వాటిపై ఒత్తిడి తేవడం మొదలు పెట్టాయి. ఆ ప్రభావం డ్రైవర్ల కమిషన్లపై, ఆఫర్లపై పడింది. ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు చోటుచేసుకుంది. కమిషన్లు తగ్గటంతో ఈఎంఐ కట్టలేక చాలామంది డ్రైవర్లు క్యాబ్లను విక్రయించడం లేదా వేరే వారికి అప్పగించి ఎదో ఒక ఉద్యోగం చూసుకొంటున్నారు.

మెట్రో రైలు రావడమూ ఓ కారణం
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం కూడా క్యాబ్లకు ఆదరణ తగ్గేందుకు కారణం అయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత 3-4 నెలలుగా దేశవ్యాప్తంగా పాసెంజర్, కమర్షియల్ వాహనాల విక్రయాలు మందగించడం కూడా ఈ ట్రెండ్ ను సూచిస్తోంది. ఒక్క మహారాష్ట్ర లోనే వాహనాల విక్రయాలు గత నెలలో దాదాపు సగానికి తగ్గాయట.
రోజువారీ రైడ్లు తగ్గడంతో ఉబెర్, ఓలా ఓంపెనీలు ఫుడ్ డెలివరీ వంటి కొత్త తరహా వ్యాపారాల్లోకి ప్రవేశించిన అక్కడ కూడా నష్టాలే వస్తుండటం ఈ రంగంలో కొనసాగుతున్న మందగమనానికి సూచనగా నిలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications