ప్రపంచ కప్ సందర్భంగా రిలయన్స్ జియో తమ సబ్‌స్క్రైబర్లకు బంపరాఫర్ ఇచ్చింది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లు జియో టీవీలో హాట్‌స్టార్ ద్వారా ఉచితంగా వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూడవచ్చునని మంగళవారం నాడు ప్రకటించింది. బుధవారం భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌కు ఒకరోజు ముందు జియో ఈ ప్రకటన చేసి, తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ప్రతి మ్యాచ్‌ను ఉచితంగా చూడవచ్చు. మ్యాచ్‌లకు సంబంధించిన సమాచారం కూడా యాప్ ద్వారా అందిస్తోంది. మై జియో యాప్ ద్వారా పలు ఆకర్షణీయ బహుమతుల్ను గెలుచుకోవచ్చు.

మ్యాచ్‌లు ఉచితంగా చూడాలంటే ఏం చేయాలి
ప్రపంచ కప్ క్రికెట్ ఫీవర్ నేపథ్యంలో ఈ ప్రయోజనం పొందాలంటే రూ.251 విలువ గల క్రికెట్ సీజన్ డేటా ప్యాకేజీని యాక్టివేట్ చేసుకోవాలి. ఈ రీచార్జ్ ద్వారా జియో యూజర్లు రూ.365 విలువ కలిగిన బెనిఫిట్స్ పొందవచ్చు. క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ రీచార్జ్ చేసుకుంటే 51 రోజుల పాటు 2GB డేటా చొప్పున మొత్తం 51 రోజులకు 102GB హైస్పీడ్ డేటా వస్తుంది.

జియో కాంటెస్ట్
పై ప్రయోజనాలతో పాటు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకోవచ్చు. ఈ కాంటెస్ట్ జియో, నాన్ జియో సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంటుంది. అయితే మై జియో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. బాల్... బాల్‌కు, ఓవర్.. ఓవర్‌కు, మ్యాచ్ పైన ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు చెప్పడం ద్వారా పాయింట్స్ వస్తాయి. ఎక్కువ పాయింట్స్ వచ్చిన వారికి గిఫ్ట్స్ ఉంటాయి.

ఎలా చూడవచ్చు
OTT యాప్స్, జియో టీవీ ద్వారా యూజర్లు ప్రపంచకప్ మ్యాచులను వీక్షించవచ్చు.
జియో యూజర్లకు హాట్‌స్టార్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. అన్ని వరల్డ్ కప్ మ్యాచులకు నేరుగా యాక్సెస్ ఇవ్వబడింది.
క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ రీచార్జ్ చేసుకున్న తర్వాత యూజర్లకు జియో టీవీ యాప్ ఓపెన్ చేయగానే హాట్‌స్టార్‌కు రీడైరెక్ట్ చేయబడుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications