నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే ఆ ప్రభావం ప్రభుత్వాలపై ఉంటుంది. గతంలో ఉల్లిగడ్డ ధర పెరగడం వల్ల ప్రభుత్వం పడిపోయిందనే వాదన ఉంది. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ వంటి ధరల పెరుగుదల విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి. ఉల్లి ధరలు పెరుగుతాయనే ఆందోళనతో ప్రభుత్వం పెద్ద ఎత్తున స్టాక్ తెస్తోంది.

50,000 టన్నుల ఉల్లి నిల్వలకు శ్రీకారం
ఉల్లిగడ్డ ఉత్పాదక రాష్ట్రాల్లో కరువు నేపథ్యంలో రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో 50,000 టన్నుల భారీ నిల్వకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మంగళవారం నాడు సీనియర్ ఫుడ్ మినిస్ట్రీ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసియాలోనే ఉల్లికి అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ అయిన లాసల్‌గోన్ (మహారాష్ట్ర)లో మంగళవారం కిలో ఉల్లి ధర 29 శాతం పెరిగింది. దీంతో ధర రూ.11కు చేరుకుంది. గత ఏడాది ఇదే రోజున రూ.8.50గా ఉంది. ఉల్లి ఉత్పత్తి తక్కువగా ఉండటమే దీనికి కారణం. దేశ రాజధాని ఢిల్లీలో వివిధ రకాల ఉల్లి ధరలు రూ.20 నుంచి రూ.25 వరకు ఉన్నాయి.

ఉల్లి ధరలు పెరిగే అవకాశం
ఉల్లిగడ్డను ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రబీ సీజన్‌లో ఉల్లి ఉత్పత్తి గతంలో కంటే తక్కువగా ఉంటుందని అంచనాలు ఉన్నాయని, కాబట్టి ఉల్లిగడ్డ తక్కువగా దొరకడం.. దానికి తోడు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని సదరు అధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. దేశీయ అవసరాల నిమిత్తం భారీ నిల్వలకు సిద్ధమైనట్లు అధికారులు చెప్పారు. దాదాపు 60 శాతం ఉల్లి మహారాష్ట్ర ఉత్పత్తి చేస్తోంది. మహారాష్ట్రతో పాటు కర్నాటక, ఏపీ వంటి ప్రధాన ఉల్లి ఉత్పాదక రాష్ట్రాల్లోను కరువు కారణంగా ఈ ఏడాది దిగుబడి అంతంతమాత్రమే ఉండవచ్చునని అంచనాలు ఉన్నాయి.

ఉత్పత్తి తగ్గుదల
32,000 టన్నులకు పైగా రబీ ఉల్లి (తెల్ల ఉల్లి)ని కొనుగోలు చేశారు. దీనిని స్టోర్ చేసి జూలై తర్వాత ఉల్లి డిమాండ్ పెరిగిన సమయంలో దీనిని ఉపయోగించనున్నారు. ఈ నెలతో ముగిసే ప్రస్తుత 2018-19 పంట సంవత్సరంలో ఉల్లి ఉత్పత్తి నిరుడుతో పోల్చితే స్వల్పంగా పెరిగి 23.62 మిలియన్ టన్నులుగా ఉంటుందని మొదట అంచనా వేశారు. అయితే సవరించిన అంచనాల ప్రకారం కరువు పరిస్థితుల దృష్ట్యా ఉత్పత్తి తగ్గవచ్చునని చెబుతున్నారు. గతంలో కిలో ఉల్లి రూ.100 వరకు కూడా పెరిగిన విషయం తెలిసిందే.

పప్పు దినుసుల సేకరణ
గత ఏడాది ఉల్లి ఉత్పత్తి భారీగా పెరగడంతో రైతులు 50 పైసలకు తక్కువకు విక్రయించారు. ఈసారి అది రివర్స్ అవుతోంది. ఇదిలా ఉండగా, ఉల్లిగడ్డతో పాటు ఇతర నిత్యావసర వస్తువులపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వం ఈ ఏడాది (2019-20) 16.15 లక్షల టన్నుల పప్పు దినుసులను నిల్వ చేస్తోంది. ఇప్పటికే 11.53 లక్షల టన్నుల పప్పు దినుసులను సేకరించింది.

జూలై - సెప్టెంబర్‌లో ధరలు...
50,000 టన్నుల ఉల్లిని సేకరించాలని ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ కమిటీ... నాఫెడ్ (NAFED-National Agricultural Cooperative Marketing Federation of India Ltd)కు సూచించిందని, ఇప్పటికే 32,000 టన్నులు సేకరించిందని, ధరలు పెరిగితే ప్రభుత్వం అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే దీనిపై దృష్టి సారించిందని అధికారులు చెప్పారు. సాధారణంగా ఉల్లి ధరలు జూలై - సెప్టెంబర్ మధ్య పెరుగుతాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications