దివాన్ హౌసింగ్ ఫైనాన్స్... పతనం అంచున ఉన్న ప్రముఖ సంస్థ. తాజాగా రూ.1000 కోట్ల వడ్డీ చెల్లింపు ఆలస్యంతో డిహెచ్ఎఫ్ఎల్ మరోసారి వార్తల్లోకెక్కింది. కాస్త కుదుటపడ్తోంది అని అనుకునేలోపు ఈ స్థాయిలో వచ్చిన కుదుపు బ్యాంకింగ్, కార్పొరేట్ రంగంలో మరో సంచలనానికి తెరదీసింది. అయితే ఇది ఆలస్యమే కానీ.. తాము ఇంకా డిఫాల్ట్ కాలేదని యాజమాన్యం చెబ్తోంది.

మ్యూచువల్ ఫండ్స్ వణుకు
గృహ రుణాల విభాగంలో ఇంతకాలం ప్రధానంగా ఉన్న ఈ సంస్థ గతేడాది నుంచి చతికిలపడింది. ప్రమోటర్లపై ఆరోపణలు, ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం వంటివి మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. గతేడాది జూన్ నెలలో ఈ సంస్థ సుమారు రూ.11 వేల కోట్ల విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్.సి.డి)ను 8.90 - 9.10 శాతం వడ్డీతో స్వీకరించింది. ఈ బాండ్లను యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ సహా మరికొంత మంది ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు సదరు బాండ్లకు వడ్డీ చెల్లించాల్సిన సమయమొచ్చింది. కానీ రూ.1000 కోట్ల ఆ వడ్డీ సొమ్మును చెల్లించేందుకు ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్ దగ్గర మాత్రం నిధులు లేవు. ఈ వార్తలు మరోసారి ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ సబ్‌స్క్రైబర్లకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని ఆలోచించే పనిలోపడ్డాయి.

డిహెచ్ఎఫ్ఎల్ ఏం చెబ్తోంది
ఈ వ్యవహారంపై డిహెచ్ఎఫ్ఎల్ వాదన మరోలా ఉంది. డిలే అయ్యింది కానీ డిఫాల్ట్ మాత్రం కాలేదు కదా అని సంస్థ వాదిస్తోంది. వారం రోజుల గ్రేస్ సమయం తమకు ఉంటుందని ఆ లోపు సర్దుబాట్లు చేస్తామని ధీమాగా చెబ్తోంది. డిబెంచర్ ట్రస్ట్ డీడ్ ప్రకారం వారం రోజుల పాటు రుణగ్రహీతకు సమయం దొరుకుతుంది. అయితే ఈ లోపు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకుని గడువు కోరుతోంది దివాన్ హౌసింగ్.
అయితే ఇప్పటికిప్పుడు దివాన్ హౌసింగ్‌కు అంత సొమ్ము ఎవరు అప్పుగా ఇస్తారు అనేదే అనుమానంగా ఉంది. ఈ మధ్యే ఈ సంస్థ వాణిజ్య రుణపత్రాలకు ఏ4ప్లస్ నుంచి ఏ3ప్లస్‌కు రేటింగ్‌ను తగ్గించింది క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ. ఈ తరుణంలో అంత రిస్క్ తీసుకుని ఎవరు రుణమిస్తారనే భయం మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్‌లో ఉంది.

ఓక్‌ట్రీ డీల్
అమెరికా దేశానికి చెందిన ఓక్ ట్రీ క్యాపిటల్ అనే సంస్థతో చర్చలు జరుపుతోంది డిహెచ్ఎఫ్ఎల్. రూ.17000 నుంచి 18000 కోట్ల విలువైన రిటైల్ హౌసింగ్ లోన్లను గంపగుత్తగా వాళ్లకు బదలాయించాలని చూస్తోంది. త్వరలో ఈ డీల్ పూర్తి కావొచ్చని యాజమాన్యం చెబ్తోంది. ఇదే జరిగితే సంస్థకు ఎంతో కొంత ఊరట దక్కుతుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications