స్టాక్ మార్కెట్ మళ్లీ నీరసించింది. నిన్న రెట్టించిన ఉత్సాహంతో వారాన్ని ప్రారంభించిన నిఫ్టీ ఈ రోజు కాస్త తడబడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నిరుత్సాహక సంకేతాల నేపధ్యంలో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. మిడ్ సెషన్ తర్వాత ఒత్తిడి మరింతగా పెరిగింది. ఇంట్రాడేలో నిఫ్టీ 12, 005 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. కానీ పన్నెండు వేల పాయింట్ల సెంటిమెంట్ మార్క్ పైన ముగియడం ఊరటనిచ్చే అంశమే.
ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, మీడియా రంగ కౌంటర్లలో ఎక్కువగా సెల్లింగ్ కొనసాగింది. ఆశ్చర్యకరంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో మాత్రం ఆ స్థాయి సెల్లింగ్ నమోదు కాలేదు. రెండు ఇండెక్సులూ పాజిటివ్‌గా ముగిశాయి. ప్రధానంగా లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉండడం గమనించాల్సిన అంశం.
చివరకు సెన్సెక్స్ 185 పాయింట్లు కోల్పోయి 40,083 పాయింట్ల దగ్గర క్లోజైంది. నిఫ్టీ 67 పాయింట్లు తగ్గి 12021 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 65 పాయింట్లు తగ్గి 31589 వద్ద స్థిరపడ్డాయి.

యెస్ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, వేదాంతా స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జీ ఎంటర్‌టైన్మెంట్, హీరో మోటోకార్ప్, టీసీఎస్, హెచ్ సి ఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్ స్టాక్ లూజర్స్‌గా నిలిచాయి.
హెరిటేజ్ కోలుకుంది
వరుస పతనాలతో ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ ఈ రోజు కాస్త కోలుకుంది. 5 శాతం వరకూ లాభపడింది. ఇంట్రాడేలో రూ.413 వరకూ వెళ్లిన స్టాక్ చివరకు రూ.409 దగ్గర క్లోజైంది.
ఇదే బాటలో అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ కూడా 5 శాతం పెరిగి రూ.224 దగ్గర స్థిరపడింది. ఈ స్టాక్ కూడా కొద్ది రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది.
సిమెంట్ స్టాక్స్ భారీ పతనం
దక్షిణాది ప్రాంతాల్లో ఆఫ్ సీజన్ కారణంగా సిమెంట్ ధరలు బస్తాకు రూ. 25-30 వరకూ తగ్గాయనే వార్తల నేపధ్యంలో సిమెంట్ స్టాక్స్ నీరసించాయి. ప్రధాన కంపెనీల షేర్లతో పాటు మిడ్ సైజ్డ్ కంపెనీల స్టాక్స్ కూడా పతన బాట పట్టాయి. అంబుజా సిమెంట్స్, ఏసీసీ 4 శాతం వరకూ క్షీణించాయి.
శ్రీ సిమెంట్స్ 3.5 శాతం, సంఘీ ఇండస్ట్రీస్ 5 శాతం, ఇండియా సిమెంట్స్ 5 శాతం తగ్గాయి.
యాక్సిస్ బ్యాంక్ రికార్డ్
ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ ఆకర్షణీయంగా మారుతున్న తరుణంలో యాక్సిస్ బ్యాంక్ స్టాక్ మరింతగా పటిష్టమవుతోంది. ఈ స్టాక్ ఈ రోజు రూ.826.25 ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. చివరకు రూ.821.40 దగ్గర క్లోజైంది.
ఆయిల్ స్టాక్స్ వీక్
ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు కూల్ అయిన నేపధ్యంలో గత మూడు రోజుల నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల స్టాక్స్ లాభాల్లో పయనిస్తూ వస్తున్నాయి. ఈ రోజు వాటిల్లో లాభాల స్వీకరణ నమోదైంది. బిపిసిఎల్ 2 శాతం, హిందుస్తాన్ పెట్రోలియం 2 శాతం, ఇండియన్ ఆయిల్2.5 శాతం నష్టపోయాయి.
రేపు మార్కెట్లకు సెలవు
రంజాన్ సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు. తిరిగి మార్కెట్లు గురువారం ప్రారంభమవుతాయి.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications