హైదరాబాద్: ప్రముఖ డిజిటల్ పెమెంట్స్ సంస్థ Paytm త్వరలో ఆన్లైన్ ఇన్సూరెన్సు సేవలు అందించే Coverfox అనే startup కంపెనీని కొనుగోలు చేయనుంది . ఇందుకోసం paytm ఏకంగా $100 మిలియన్ (సుమారు రూ . 700 కోట్లు ) చెల్లించనుంది . 2013లో వరుణ్ దువా , దేవేంద్ర రాణే Coverfox కంపెనీని స్థాపించారు . ముంబై కేంద్రంగా Coverfox తన సేవలను అందిస్తోంది. అయితే ఇదే తరహా సేవలను అందించే Acko అనే కంపెనీ నడిపించేందుకు వరుణ్ దువా 2017 లోనే Coverfox సంస్థను వీడారు. ఈ డీల్ కుదిరితే paytm ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మకు ఇదే అతిపెద్ద కొనుగోలు అవుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ది ఎకనామిక్ టైమ్స్ ఈమేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. జీవిత బీమా , సాధారణ బీమా పాలసీ లను ఆన్లైన్ లో విక్రయించే Coverfox , గతేడాది $100 మిలియన్ (సుమారు రూ 700 కోట్లు ) విలువైన పాలసీ లను విక్రయించి దాదాపు $22 మిలియన్ (సుమారు రూ 154 కోట్లు ) వ్యాపారాన్ని నమోదు చేసింది. ఈ కంపెనీ కి సుమారు 50,000 మంది ఏజెంట్స్ ఉన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో తనదైన ముద్ర వేసిన Paytm ఈ కొత్త కంపెనీ కొనుగోలు ద్వారా Paytm మనీ విభాగంలో కూడా విస్తరించాలని భావిస్తోంది. ఈ కొనుగులు అనంతరం దేశంలో అతిపెద్దదైన బ్యాంకింగ్ , ఇన్సూరెన్సు సేవల సంస్థ Policybazar కి Paytm మనీ గట్టి పోటీదారు అవుతుంది .

ఇప్పటివరకు Coverfox దాదాపు $40 మిలియన్ (సుమారు రూ 280 కోట్లు ) పెట్టుబడి సమీకరించింది . ఇందులో సైఫ్ పార్టనర్స్, ఆక్సిల్ పార్టనర్స్ సహా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తి కి చెందిన కాటమెరాన్ వెంచర్స్ , ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టుబడులు పెట్టాయి. మ్యూచ్యువల్ ఫండ్స్ వ్యాపారం నిర్వహించేందుకు గతేడాది సెప్టెంబర్లో Paytm Money సేవలను ప్రారంభించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications