మోటార్ వాహనాల కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్ స్టేజ్ (BS) నిబంధనలను ఎప్పటికి అప్పుడు మారుస్తోంది. తాజాగా కేంద్రం BS6 నిబంధనలు తీసుకు వస్తోంది. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ వాహనాలు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో మహింద్రా అండ్ మహీంద్రా వచ్చే ఏడాది నుంచి బీఎస్6 పెట్రోల్, డీజిల్ వాహనాలను మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రకటన చేసింది.
BS6 నిబంధనలకు అనుగుణంగా వాహనాల మోడల్స్‌ను వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో మార్కెట్లోకి ప్రవేశపెడతామని సంస్థ ఎండీ పవన్ గోయంకా చెప్పారు. కొత్త నిబంధలు డీజిల్ వాహనాలను మరింత ప్రియం చేయనున్నాయని చెప్పారు. 2020 ఏప్రిల్ 1 నాటికి పెట్రోల్, డీజిల్ రకాల వాహనాలు సిద్ధమవుతాయన్నారు. నాలుగు మీటర్లకు మించి పొడవు ఉన్న వాహనాలపై 50 శాతం వరకు జీఎస్టీ పెరగవచ్చునని, ఈ పెంపు రూ.లక్షల వరకు ఉంటుందన్నారు.

చిన్న డీజిల్ వాహనాలపై రూ.80,000 వేల వరకు పెరగవచ్చునని చెప్పారు. పెట్రోల్ మోడల్స్ పైన రూ20 వేల నుంచి రూ.25 వేల వరకు పెరుగుదల ఉండే అవకాశముందన్నారు. ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికం చివరి నాటికి బీఎస్ 6 గ్యాసోలిన్ వాహనాన్నిసిద్ధం చేస్తున్నామని, కానీ డీజిల్ వాహనానికి మాత్రం దేశం మొత్తం ఒకే బీఎస్ 6 ఇంధనం అందుబాటులో ఉండాలనే నిబంధన ఉన్నందున ఈ వాహనం విడుదల ఆలస్యం కానుందన్నారు. నిబంధనలకు అనుగుణంగా వాహనాలు ఉత్పత్తి చేసేందుకు రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టామని, అమలు విషయంలో టెక్నికల్ సమస్యలు ఎదుర్కోలేదన్నారు.
మహింద్రా అండ్ మహీంద్రా ఈ మూడున్నరేళ్లలో కొత్త ఇంజిన్ల అభివృద్ధికి పైన చెప్పిన రూ.1,000 కోట్లు ఖర్చు చేసింది. పదకొండు ప్రదేశాల్లో 136 వాహనాలను 69 లక్షల కిలోమీటర్లు తిప్పి పరీక్షలు నిర్వహించారు. బీఎస్6 మోడల్ కేయూవీ 100 డీజిల్ మోడల్ లాభాలపై సందేహాలు ఉండటంతో దీని కొనసాగింపుపై మహింద్రా అండ్ మహీంద్రా మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు, పెట్రోల్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది.


Click it and Unblock the Notifications