దేశంలో 5G ట్రయల్స్‌ను ప్రారంభించేందుకు 100 రోజుల గడువును విధించారు కొత్త టెలికాం మినిస్టర్ రవిశంకర ప్రసాద్. వచ్చే స్పెక్ట్రం ఆక్షన్ ఈ క్యాలెండర్ ఇయర్‌లోనే ఉంటుందని, ఇందులో 5G కూడా ఉంటుందని తెలిపారు. ఆయన మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ మంత్రిగా సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ లా అండ్ జస్టిస్ బాధ్యతలు కూడా ఈయనవే.
బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆయన మాట్లాడారు. రాబోయే 100 రోజుల్లో 5జీ ట్రయల్స్‌ను ప్రారంభించాలని చూస్తున్నామని చెప్పారు. 5జీసహా ఇతర రేడియో తరంగాలకు వేలం నిర్వహిస్తామని, ఈ మెగా వేలం ఈ ఏడాదే ఉంటుందన్నారు. సరిపడా స్పెక్ట్రం అందుబాటులో ఉందని చెప్పారు. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) దాదాపు 8,644 మెగాహెట్జ్ టెలికం ఫ్రీక్వెన్సీలను వేలానికి సిఫార్స్ చేసిందన్నారు.

ఇందులో 5G సర్వీసులు ఉన్నాయని చెప్పారు. ట్రయల్ మొదలైన తర్వాత 5Gలో పాల్గొనడం అనేది తప్పనిసరి కాదని, భద్రతాసమస్యలతో సహా ఒక కంపెనీ పాల్గొంటుందా లేదా అనేది సంక్లిష్టమైందన్నారు. ఈ ప్రాధాన్యతా జాబితాలో ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉన్నాయని చెప్పారు. ఈ రంగంలో ప్రభుత్వ రంగ ఉనికి సమంజసమని భావిస్తున్నామన్నారు.
తాము టెలికం రంగ ఆర్థిక ఇబ్బందులపై దృష్టి సారిస్తామని రవిశంకర ప్రసాద్ చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ సంక్షోభాన్ని నివారిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో చైనా టెలికం దిగ్గజం హువావేపై కూడా ఆయన స్పందించారు. 5G ట్రయల్స్‌లో హువావే పాల్గొంటుందా అని మీడియా ప్రశ్నించగా, అది చాలా పెద్ద అంశమని, భద్రతా కారణాలు తదితర కోణాల్లో పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు అయితే హువావేపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
ఇదిలా ఉండగా, స్పెక్ట్రం కనీస ధర రూ.4.9 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఆర్థికపరమైన తీవ్ర ఒత్తిడిలో ఉన్న దేశీయ టెలికం రంగం దీనిపై ఆసక్తితో ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్‌ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

డబ్బు కావలిసినంత ఉన్నా పర్సనల్ లోన్ల వైపు పరిగెత్తుతున్న ధనవంతులు.. కారణం ఏంటంటే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications