న్యూఢిల్లీ: 6,800కు పైగా కేసులతో బ్యాంకులను మోసగించిన విలువ గత ఆర్థిక సంవత్సరం నాటికి (2018-19) రూ.71,500 కోట్లుగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపింది. 2017-18 నాటికి 5,916 కేసులతో రూ.41,167.03 ఉందని పేర్కొంది. గత ఏడాది 73 శాతం పెరిగి రూ.71,542.93 కోట్లుగా ఉందని పేర్కొంది. పీటీఐకి చెందిన ఓ జర్నలిస్ట్ ఈ అంశానికి సంబంధించి ఆర్టీఐ దాఖలు చేశారు. దీంతో విషయం వెలుగు చూసింది.
ఈ ఏడాది మార్చి 31తో గత ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, కొన్ని ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ద్వారా 6,800కు పైగా కేసులు దాఖలైయ్యాయి. వీటి విలువ రూ.71,542.93 కోట్లుగా ఉంది.
గడిచిన పదకొండు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకింగ్ మోసాలకు సంబంధించి మొత్తం 53,334 కేసులు నమోదైయ్యాయని, వీటి విలువ రూ.2.05 లక్షల కోట్లని ఆర్బీఐ తెలిపింది. ఈ కేసుల్లో దర్యాఫ్తు సంస్థలు ఇప్పటికే చర్యలు తీసుకున్నాయా లేదా తీసుకుంటున్నాయా అనే సమాచారం తమ వద్ద లేదని పేర్కొంది.

విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ వంటి వ్యాపార, పారిశ్రామికవేత్తలకు ఈ కేసులతో ప్రమేయం ఉంది. అలాగే, వివిధ ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లోని ఉన్నతోద్యోగుల పైనా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సీబీఐ, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐవో వంటి సంస్థలు కేసులు నమోదు చేసి విచారిస్తున్నాయి. బ్యాంకింగ్ మోసాల విషయాలను గమనిస్తే 15 రంగాలు, అంశాల్లో ఎక్కువగా నమోదయ్యాయి. వాటిలో రత్నాలు, ఆభరణాల వ్యాపారులు టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత తయారీ, పరిశ్రమ, వ్యవసాయ, మీడియా, పౌరవిమానయానం, సేవా, ప్రాజెక్ట్స్, డిస్కౌంటింగ్ ఆప్ చెక్స్, ట్రేడింగ్, ఐటీ, ఎగుమతులు, ఎఫ్‌డీ, డిమాండ్ లోన్, లెటర్ ఆప్ కంఫర్ట్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications