ఇంటి తరహా భోజనం కోసం స్విగ్గీ నుంచి సరికొత్త యాప్

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ సోమవారం నాడు స్విగ్గీ డెయిలీని (Swiggy Daily) యాప్‌ను లాంచ్ చేసింది. కొంతమందికి ఇంటి భోజనం తప్ప ఇతర ప్రదేశాల్లో వండినవి తినటం ఇష్టం ఉండదు. అలాంటి వారి కోసమే స్విగ్గీ డెయిలీ. అలాంటి వారి కోసం పూర్తిగా ఇంటి వాతావరణంలో తయారు చేసిన భోజనాన్ని స్విగ్గీ అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రస్తుతం గురుగ్రామ్‌లో స్విగ్గీ డెయిలీ యాప్‌ను ప్రారంభించారు. అక్కడ సేవలు అందిస్తారు. దీనిని త్వరలోనే బెంగళూరు, ముంబై నగరాలకు విస్తరించనున్నట్లు స్విగ్గీ తెలిపింది. ఈ యాప్‌లో మరో సౌలభ్యం ఉంది. ఇందులో ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవచ్చు. వారం లేదా నెలసరి చందా చెల్లించి ఆర్డర్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Swiggy to provide homestyle meals: launches Daily app

తక్కువ, నాణ్యతతో కూడిన రోజువారి భోజనానికి డిమాండ్ పెరుగుతోంది. దీనిని అందుకునేందుకు ఆర్గనైజ్డ్ వెండర్స్, హోమ్ చెఫ్స్ సాయంతో భోజనాన్ని ఈ యాప్ ద్వారా అందిస్తున్నామని సంస్థ సీఈవో తెలిపారు. భోజనం విషయంలో ప్రముఖ వెండర్స్ సుమితాస్ ఫుడ్‌ ప్లానెట్, అహ్మద్స్ కిచెన్, సాచీ జైన్, హోమ్లీ వంటి వాటి ద్వారా అందించనున్నట్లు పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+