ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందనే అంచనాలు వెలువడటంతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. రికార్డు స్థాయిలో మార్కెట్లు సోమవారం లాభాలు చూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 553 పాయింట్లకు పెరిగి 40,268 పాయింట్ల విద్ద ట్రేడ్ అవగా నిఫ్టీ 166 పాయింట్లు లాభంతో 12,088 పాయింట్ల దగ్గర ముగిసింది. సెన్సెక్స్ ముల్లు 598 పాయింట్ల దగ్గర దోబూచులాడి ట్రేడింగ్ ముగిసే సమాయనికి 553.42 పాయింట్ల దగ్గర క్లోజ్ అయ్యింది.
ఇక ఈ రోజు జరిగిన ట్రేడింగ్‌లో లాభాలు పొందిన వాటిలో హీరోమోటో కార్ప్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందుస్తాన్ యునీలివర్ లిమిటెడ్, మారుతీలు 5.87శాతం వృద్ధిని నమోదు చేశాయి.మరోవైపు చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటం లాంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలపర్చాయి. దీంతో ఆరంభం నుంచే దూకుడు మీదున్న సెన్సెక్స్ నిఫ్టీలు కొత్త రికార్డును క్రియేట్ చేశాయి. కొనుగోళ్లు కూడా బాగా జరగడంతో సోమవారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. 200 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్.. మధ్యాహ్నం తర్వాత మరింత జోరు పెంచింది. హెచ్‌డీఎఫ్‌సీ సహా ఇతర కీలక షేర్లు రాణించడంతో భారీ లాభాలు మార్కెట్లను పలకరించాయి.

ఇదిలా ఉంటే గెయిల్, టెక్ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు స్వల్పంగా అంటే 0.13శాతంతో నష్టపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వారంలో జరిగే సమీక్షలో వడ్డీ రేట్లను
తగ్గించే అవకాశం ఉందని అంచనాలతో ట్రేడ్ మార్కెట్లలో ఊపు కనిపించింది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా మందగించిందని కేంద్ర గణాంకాల శాఖ లెక్కలు వెలువరించిన నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనా వేస్తున్నారు మార్కెట్ అనలిస్టులు. ఆర్థిక వ్యవస్థ మందగించడానికి వ్యవసాయ రంగంలో , ఉత్పత్తి రంగంలో సరైన ఔట్‌పుట్ లేకపోవడమే కారణమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications