సావరిన్ గోల్డ్ బాండ్స్ కొత్త సిరీస్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గ్రాము బంగారం ధరను ప్రభుత్వం రూ. 3,196 గా నిర్ణయించింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసేవారికి, చెల్లింపులు డిజిటల్ రూపంలో చేసే వారికి ఒక్కో గ్రాముపై రూ. 50 డిస్కౌంట్ ఇవ్వాలని ఆర్బీఐ కి ప్రభుత్వం సూచించింది. ఇలా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసే ఇన్వెస్టర్లు గ్రాముకు రూ . 3,146 చెల్లిస్తే సరిపోతుంది. ఆర్బీఐ గత గురువారం నాడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి సావరిన్ గోల్డ్ బాండ్ల క్యాలెండర్ ను విడుదల చేసింది.
దీని ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలలోను బాండ్లను జారీ చేస్తారు. భౌతిక రూపంలో బంగారం కొనుగోళ్లను తగ్గించటానికి 2015 నవంబరులో ప్రభుత్వం గోల్డ్ బాండ్ స్కీం ను ప్రారంభించారు. ఈ స్కీం లో భాగంగా గ్రాము బంగారాన్ని యూనిట్ల రూపంలో జారీ చేస్తారు. ఈ బాండ్లలో కనీస పెట్టుబడి ఒక గ్రాము. వ్యక్తులు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 500 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇండివిడ్యువల్స్, హిందూ అవిభాజ్య కుటుంబాలు 4కేజీ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు 20 కిలోలకు సమానమైన బంగారం యూనిట్లను కొనుగోలు చేయవచ్చు.

బంగారం బాండ్ల జారీ క్యాలెండర్ వచ్చేసింది...
సావరిన్ గోల్డ్ బాండ్ల జారీకి సంబందించిన క్యాలెండర్ ను భారత రిజర్వు బ్యాంకు జారీ చేసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ప్రథమార్థంలో ఎప్పుడు ఈ బాండ్లను జారీ చేయాలో ఇందులో పేర్కొంది. జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలలోనే ఈ బాండ్లను జారీ చేయనున్నారు. ఈ బండ్లను షెడ్యూల్డ్ బ్యాంకులు (చిన్న ఫైనాన్స్ బ్యాంక్స్ , పేమెంట్ బ్యాంక్స్ మినహా ), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ హెచ్ సి ఐ ఎల్ ), డిజిగ్నేటెడ్ పోస్టాఫీసులు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
- మొదటి విడతగా బాండ్ల (2091-20 సిరీస్ I) సబ్ స్కిప్షన్ జూన్ 3న ప్రారంభం అవుతుంది. 2019-20 'సిరీస్ II బాండ్లు జూలై 8 నుంచి అందుబాటులో ఉంటాయి.
- 2019-20 సిరీస్ III, 'సీరీస్ IV బాండ్లువరుసగా ఆగస్టు 5, సెప్టెంబర్ 9 తేదీల నుంచి అందుబాటులో ఉంటాయి.
- బంగారం అమ్మకాలు తగ్గించి బంగారం రూపంలోనే పెట్టుబడులు, పొదుపు పెరిగేందుకు వీలుగా 2015 సంవత్సరంలో ఈ సావరిన్ గోల్డ్ బ్యాండ్ స్కీం ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
- ఈ పథకంలో భాగంగా గ్రాము బంగారాన్ని యూనిట్ల రూపంలో ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్ల జారీకి ముందు యూనిట్ల ధరను నిర్ణయిస్తారు.
- ఈ బాండ్లలో కనీసం ఒక గ్రాముతో పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఒక వ్యక్తి ఒక ఆర్ధిక సంవత్సరంలో 500 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
- ఇండివిడ్యువల్స్, హిందూ అవిభక్త కుటుంబాలు గరిష్టంగా 4 కిలోలు, ట్రస్టులు , చిన్న సంస్థలు 20 కిలోల బంగారానికి సమానమైన యూనిట్లను ఒక ఆర్ధిక సంవత్సరంలో కొనుగోలు చేయవచ్చు.
- ఈ బాండ్లపై వార్షికంగా 2.5 శాతం వడ్డీ రేటు చెల్లిస్తారు.
- బాండ్ల రెడెంప్షన్ సందర్భములో కాపిటల్ గెయిన్స్ టాక్స్ ఉండదు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications