మే నెలలో భారీగా తగ్గిన కారు అమ్మకాలు
దేశీయ వాహన రంగం డిమాండ్ తగ్గుతోంది. అధిక ఫైనాన్స్ వ్యయం, ద్రవ్య లభ్యత తగ్గిపోవడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో మే నెలలో కూడా అమ్మకాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ రంగంలోని మార్కెట్ లీడర్లు విక్రయాలు సైతం 20 శాతానికి మించి దిగజారాయి. ఆయా కంపెనీలు తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం గత నెలలో మారుతీ సుజుకీ ఇండియా సేల్స్ 22 శాతం క్షీణించాయి. టాటా మోటార్స్ విక్రయాలు 26 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 3 శాతం తగ్గాయి.
సాధారణంగా ఎన్నికలకు ముందు ఆటో మొబైల్ అమ్మకాలు తగ్గుతాయి. మరోవైపు హైబేస్ నంబర్, అధిక ఫైనాన్స్ వ్యయం ఉన్నందున గత నెలలో సేల్స్ భారీగానే తగ్గాయని మహీంద్రా అటోమోటివ్ విభాగ ప్రెసిడెంట్ రాజన్ వాదేర చెప్పారు.

మారుతీ సుజుకీ విక్రయాలు 23 శాతం, టాటా మోటార్స్ 26 శాతం, హోండా కార్ప్ 28 శాతం, మహీంద్రా 1.7 శాతం, హ్యుండాయ్ 5.6 శాతం, టయోటా 7.4 శాతం, రాయల్ ఎన్‌ఫీల్డ్ 17 శాతం, హీరో మోటోకార్ప్ 13.5 శాతం తగ్గాయి.
వాహన అమ్మకాల క్షీణతకు ముగింపు పలికేందుకు గాను అన్ని రకాల వాహనాలపై జీఎస్టీని పద్దెనిమిది శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ ఉంది. జూలైలో కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆటోమొబైల్ తయారీదారుల సంఘం ఈ విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే, కాలుష్య నిరోధానికిగాను పాత వాహనాలను తుక్కుగా మార్చి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరింది.


Click it and Unblock the Notifications