వివాహ బంధంతో ఇద్దరు ఒకటవుతారు. కలకాలం కలిసి ఉండాలనుకుంటారు. కష్టనష్టాలొచ్చినా భరిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇద్దరూ శ్రమిస్తారు. అయితే విధి ఎవరిని ఎప్పుడేమి చేస్తుందో తెలియదు. ఇద్దరిలో ఎవరో ఒకరు ముఖ్యంగా సంపాదించే వారు అకాల మరణం చెందితే మిగిలిన వారి జీవితం, ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుంది.
జీవిత భాగస్వామిని కోల్పోయినా మిగిలిన వారిని కాస్తోకూస్తో ఆర్థికంగా ఆదుకునేది బీమా. ఈ రోజుల్లో జీవిత బీమా తీసుకోవాలన్న ఆలోచన, అవగాహన చాలా మందిలో ఉంది. అయితే పెళ్లి చేసుకున్న వారు వేర్వేరుగా కాకుండా ఉమ్మడిగా జీవిత బీమా తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.
ఉమ్మడిగా బీమాను తీసుకున్న సందర్భంలో దురదృష్టవశాత్తు ఎవరో ఒకరు చనిపోతే తన భాగస్వామికి బీమా మొత్తం చేతికి అందుతుంది. సాధారణంగా జీవిత బీమా తీసుకున్నప్పుడు నామినీ లేదా లబ్ధిదారు పేరును తెలియజేస్తాం. అదే ఉమ్మడి బీమా పాలసీలో ఇధ్దరు దానికి యజమానులుగా, లబ్ధిదారులుగా ఉంటారు. ఒకవేళ ఒకరికి ఏమైనా జరిగితే మరొకరికి బీమా కవరేజి ప్రయోజనం కలుగుతుంది.

జాయింట్ టర్మ్ ప్లాన్
ఈ బీమా తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు మాత్రమే నామినీకి సొమ్ము చెల్లిస్తారు. ప్రతి ఏడాది బీమా మొత్తం చెల్లిస్తూ ఉండాలి. ఎంత కా లం చెల్లిస్తే అంతకాలానికే బీమా కవరేజి ఉంటుంది. వ్యక్తి జీవించి ఉంటే బీమా సొమ్ము పైసా కూడా వెనక్కి రాదు. ఉమ్మడి బీమా ద్వారా మీరు, మీ భాగస్వామి కూడా నిర్దేశిత ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇద్దరిలో ఒకరు చనిపోతే మరొకరికి బీమా సొమ్ము అందుతుంది. ఈ తర్వాత కవరేజి కా లం చెల్లిపోతుంది. అనంతరం వేరేగా బీమా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది.

జాయింట్ ఎండోమెంట్ ప్లాన్
పెట్టుబడి ఉద్దేశంతో కూడా ఎండోమెంట్ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వారికీ నిర్దేశిత కాలం తర్వాత బీమా సొమ్ము చేతికి అందుతుంది. దీన్ని ఒక్కసారిగా లేదా వాయిదాల పద్దతిలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ పాలసీ గడువుకన్నా ముందుగానే బీమా తీసుకున్న ఇద్దరిలో ఒకరు మరణిస్తే మరొకరికి బీమా మొత్తం అందజేస్తారు.
ఇంకా ఎవరు జాయింట్ పాలసీ తీసుకోవచ్చు?
ఉమ్మడి జీవిత బీమాను కేవలం పెళ్లయిన భార్య భర్తలే కాకుండా వ్యాపార భాగస్వాములు, తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు మరణిస్తే పిల్లలు బీమా పాలసీ ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

ఉమ్మడి జీవిత బీమా ఎందుకు?
ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఏదైనా ఒక వస్తువును ఎవరికీ వారు కొనుగోలు చేస్తే అమ్మకం దారుడు ధరను తగ్గించే అవకాశం ఉండదు. అదే ఐదారుగురు కలిసి కొనుగోలు చేస్తే బేరమాడవచ్చు. ఇదే బీమా పాలసీలు కూడా వర్తిస్తుంది. వేర్వేరుగా బీమాను తీసుకోవడం కన్నా ఉమ్మడిగా బీమాను తీసుకుంటే చెల్లించాల్సిన బీమా ప్రీమియం తక్కువగా ఉంటుంది. తక్కువ సొమ్ముతోనే అందరూ బీమా కవరేజీని పొందవచ్చు. రెండు అనేది కచ్చితంగా ఒకటికన్నా బలమైనదే. ఇది జీవిత బీమాకు కూడా వర్తిస్తుంది. ఈరోజుల్లో వ్యక్తుల జీవన శైలి మారిపోతోంది. చాలామంది రుణాలు తీసుకొని గృహాలు, వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. పిల్లల విద్య, వివాహాల కోసం పెద్ద మొత్తంలో సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే భార్యాభర్తలు ఉద్యోగాలు చేసే పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరు దూరమైనా ఆర్ధిక భారం మిగతా వారు మోయాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే బీమా తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి బీమా ద్వారా బీమా ప్రీమియం భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications