OTT ప్లాట్‌ఫారం ZEE5తో తమ స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్ మరింత దృఢమవుతోందని భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలో భాగంగా తమ ప్లాటినమ్ పోస్ట్ పేయిడ్ కస్టమర్లకు అపరిమిత జీ5 కాంప్లిమెంటరీ యాక్స్సెస్ ఇస్తున్నట్లు తెలిపింది. రూ.499, అంతకంటే ఎక్కువ ప్లాన్ కలిగిన పోస్ట్ పేయిడ్ కస్టమర్లు దీనికి అర్హులు. ఎయిర్‌టెల్ కస్టమర్లు మై ఎయిర్‌టెల్ యాప్ (My Airtel app) ద్వారా ఈ సౌలభ్యాన్ని పొందవచ్చు.
ఎయిర్‌టెల్ ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ మూడు నెలల పాటు, అమెజాన్ ప్రైమ్ 12 నెలల పాటు ఆఫర్ చేస్తోంది. ఎయిర్‌టెల్ ప్లాటినమ్ కస్టమర్లు ఎయిర్‌టెల్ టీవీ, వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ బుక్స్, నార్టన్ సెక్యూరిటీకి కూడా ఎలిజిబుల్. ఎగ్జిస్టింగ్ ప్లాటినమ్ కస్టమర్లకు జీ5 అందిస్తుండటం సంతోషకరమైన విషయమని చెప్పారు.

ZEE5 (జీ5) విస్తృతమైన డిజిటల్ కంటెంట్. ఇందులో జీ5 ఒరిజినల్స్, మూవీస్, టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలు, లైఫ్ స్టైల్ షోలు, కిడ్స్ షోలు, ప్లేస్ ఉంటాయి. తద్వారా ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ZEE5 యాక్సెస్ ఉచితం.


Click it and Unblock the Notifications