ఓ అజ్ఞాతవ్యక్తి... బిలియనీర్ వారెన్ బఫెట్‌తో కలిసి లంచ్ చేసేందుకు ఏకంగా 4.5 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాడు. అంటే మన రూపాయల్లో దాదాపు రూ.31 కోట్లు. సాధారణంగా విలాసవంత భోజనానికి వేలు లేదా లక్షలు ఖర్చు చేస్తారు. కానీ సదరు అజ్ఞాత వ్యక్తి మాత్రం ఏకంగా ఇన్ని కోట్లు ఖర్చు చేస్తుండటం గమనార్హం. అయితే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారు అయిన వారెన్ బఫెట్‌తో లంచ్ కోసం ఖర్చు చేస్తున్నాడు.
వారెన్ బఫెట్ ప్రతి ఏడాది ఏర్పాటు చేసే ఛారిటీ లంచ్‌కు కోసం అత్యధిక మొత్తం బిడ్ అది. ఎనబై ఎనిమిదేళ్ల వారెన్ బఫెట్ గత ఇరవై ఏళ్లుగా గ్లైడ్ ఫౌండేషన్ కోసం అత్యధిక మొత్తాన్ని చెల్లించిన వారితో కలిసి భోజనం చేస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఈ సంస్థ పేదలు, కనీసం ఇళ్లు కూడా లేనివారి కోసం పని చేస్తోంది. భార్య సుసన్ బఫెట్‌ను ఈ సంస్థకు పరిచయం చేసింది. ఆ తర్వాత ఆమె మృతి చెందింది.

దీంతో తన భార్య కోసం వారెన్ బఫెట్ ఛారిటీ లంచ్‌ను కొనసాగిస్తున్నారు. దీనిలో ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఆసక్తి ఉన్నవారు ఎంత మొత్తం చెల్లిస్తారో బిడ్డింగ్ వేస్తారు. వచ్చిన బిడ్స్‌లలో అత్యధిక మొత్తానికి కోట్ చేసిన వారితో కలిసి లంచ్ చేస్తారు. 19 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమానికి తొలిసారి 25 వేల డాలర్లు వచ్చాయి. 2003 నుంచి ఈ వేలంను ఈబేలో నిర్వహిస్తున్నారు.
ఈసారి లంచ కోసం మే 26 బిడ్డింగ్ ప్రారంభమైంది. 48 గంటల్లోపే 45,67,888 (రూ.31కోట్ల) డాలర్లకు బిడ్ దాఖలైంది. ఇది గత ఏడాది మొత్తం కంటే దాదాపు మిలియన్ డాలర్లు ఎక్కువ. ఈ మొత్తాన్ని గ్లైడ్ ఫౌండేషన్‌కు అందజేస్తారు. బిడ్ దాఖలు చేసిన వారి వివరాలను రహస్యంగా ఉంచారు. ఇప్పటి వరకు ప్రయివేటు లంచ్‌ల ద్వారా 35 మిలియన్ డాలర్లను పోగు చేశారు.


Click it and Unblock the Notifications