గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) వసూళ్లు వరుసగా మూడో నెల లక్ష కోట్లు రూపాయలు దాటాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటిన విషయం తెలిసిందే. మే నెలలో కూడా రూ.1,00,289 కోట్లు వచ్చాయి. ఈ మేరకు శనివారం ఆర్థిక శాఖ విడుదల చేసింది. అయితే ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. మార్చి ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో ఏప్రిల్ నెలలో ఎక్కువ వసూళ్లు ఉంటాయి. ఏప్రిల్ నెలలో రికార్డ్ స్థాయిలో దాదాపు రూ.1,14 కోట్లు వసూలైంది. మార్చి నెలలో రూ.లక్షా ఆరువేల కోట్లకు పైగా వసూళ్లు అయ్యాయి.
గత ఏడాది (2018) మే నెలతో పోల్చుకుంటే ఈ మే నెలలో జీఎస్టీ వసూళ్లు 6.67 శాతం ఎక్కువ. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.17,811 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.24,462 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.49,891 కోట్లు, సెస్ వసూళ్లు రూ.8,125 కోట్లు. సెస్ వసూళ్లలో రూ.953 కోట్లు ఇంపోర్ట్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి.

మరోవైపు, మే నెల్లో 72.45 లక్షల మంది జీఎస్టీఆర్ 3బీ రిటర్స్ దాఖలు చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు సరాసరి నెలకు రూ.98,114 కోట్లుగా ఉంది. 2017-18 కంటే 9.2 శాతం పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరం సరాసరి (రూ.98,114)తో పోల్చితే మే నెలలో2.21 శాతం వసూళ్లు ఎక్కువగా ఉంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications